తల్లిపాలు అమృతంతో సమానం

చౌడేపల్లె ముచ్చట్లు:


తల్లిపాలు అమృతంతో సమానమని ఐసీడిఎస్‌ ఏ సిడిపిఓ సరళాదేవి అన్నారు. మంగళవారం తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని పిఎల్‌ కొత్తూరు లో తల్లులతోపాటు, గర్భవతులు, కిషోర బాలికలకు అవగాహన సదస్సు జరిగింది.ఆమె మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డ పుట్టిన అర్థగంటలోపు తాగించాలన్నారు. దీంతో బిడ్డలో రోగనిరోధకశక్తి పెరుగుతుందన్నారు.ఆరునెలల వరకు తల్లిపాలు ఇవ్వాలని సూచిస్తూ తద్వరా కలిగే ప్రయోజనాలను వివరించారు. డాక్టర్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ అపోహలు వీడి తల్లులు బిడ్డకు ముర్రుపాలు తాపాలని తెలిపారు. బిడ్డ ఆరోగ్యవంతమైన జీవితానికి ముర్రుపాలు అమృతమన్నారు. అంగన్‌వాడి కేంద్రాల్లో పంపిణీ చేస్తున్న పౌష్టిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బహుద్దీన్‌, అనూరాధ,అంగన్‌వాడీ కార్యకర్త లు నవనీత,రాధ తదితరులున్నారు.

 

Tags: Breast milk is like nectar

Leave A Reply

Your email address will not be published.