లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు

నంద్యాల ముచ్చట్లు:

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు పురస్కరించుకొని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, గురు వారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో, ప్రసూతి విభాగం సహకారంతో, నెరవాటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అరుణ కుమారి, డాక్టర్ వినోద్ ల సౌజన్యంతో గర్భిణీ స్త్రీలకు తల్లిపాల ఆవశ్యకత పై అవగాహన సదస్సు నిర్వహించి గర్భిణులకు, బాలింతలకు బ్రెడ్ ,పండ్లు పంపిణీ చేశారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు చంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ జఫ్రుల్లా, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శేషారత్నం, ఐఎంఏ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ రవికృష్ణ, ఆర్ ఎం ఓ డాక్టర్ శిరీష, ప్రసూతి విభాగం అధిపతి డాక్టర్ అనురాధ, చిన్నపిల్లల విభాగం అధిపతి డాక్టర్ లలిత, నెరవాటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ అరుణకుమారి పాల్గొని  తల్లిపాల వారోత్సవాల ప్రాముఖ్యతను తెలిపే కరపత్రాలను విడుదల చేశారు.డాక్టర్ లలిత, డాక్టర్ అరుణకుమారి తల్లిపాల ప్రయోజనాల గురించి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు వివరించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు శ్రీకాంత్, ఇమ్మడి రామకృష్ణ ,సిరిగిరి రమేష్ అధిక సంఖ్యలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు పాల్గొన్నారు.

 

Tags: Breastfeeding week organized by Lions Club

Leave A Reply

Your email address will not be published.