లంచం మెక్కిన ఎస్‌ఐ శ్రీనివాసులుకు రిమాండు

Bribery McKinna is to be remembered for SI Srinivasa

Bribery McKinna is to be remembered for SI Srinivasa

Date:17/04/2018

నెల్లూరు ముచ్చట్లు:

బాధితుడి వద్దనుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటు, ఏసిబి అధికారులకు నేరుగా దొరికిపోయిన చౌడేపల్లె ఎస్‌ఐ శ్రీనివాసులును రిమాండుకు తరలిస్తూ నెల్లూరు ఏసిబి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పుంగనూరుకు చెందిన వి.దీపక్‌ అనే యువకుడిపై తప్పుడు కేసులు బనాయిస్తామని బెదిరిస్తూ లక్ష రూపాయలు డిమాండు చేయడం, ఇందులో భాగంగా రూ.20 వేలు సీఐకి ఇచ్చామని, మిగిలింది తనకు ఇవ్వాలని ఎస్‌ఐ శ్రీనివాసులు ఒత్తిడి చేశాడు. ఈ మేరకు బాధితుడు రూ.20 వేలు ఎస్‌ఐ స్నేహితుడి ఖాతాలో జమ చేశాడు. కానీ ఎస్‌ఐ వేదింపులు తీవ్రంకావడంతో గత్యంతరం లేక బాధితుడు ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఏసిబి డిఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏసిబి అధికారులు ఎస్‌ఐ ఫోన్‌ సంబాషణలపై గత మూడు రోజులుగా నిఘా పెట్టి, వలపన్ని పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడు శ్రీనివాసులును అరెస్ట్ చేసి, నెల్లూరు ఏసిబి కోర్టులో హాజరుపరచారు. నిందితుడిని న్యాయమూర్తి జ్యూడిషియల్‌ రిమాండుకు తరలించారు. కాగా ఈ కేసులో అనేక మంది హస్తం ఉన్నట్లు ఏసిబి అధికారుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. గత మూడు సంవత్సరాలుగా చౌడేపల్లె ఎస్‌ఐ అనేక అవినీతి అక్రమాలలో లక్షలు ఆర్జించారని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలను ఊతం ఇస్తూ లక్షరూపాయలు డిమాండు చేయడం , తీసుకుంటు దొరికిపోవడం పోలీస్‌ వర్గాలను కలవరపరుస్తోంది. చిత్తూరు జిల్లా చరిత్రలో లేని విధంగా ఓ ఎస్‌ఐ తన గవర్నమెంట్‌ సెల్‌ఫోన్‌ ద్వారా లంచం డిమాండు చేస్తూ, పలుసార్లు బెదిరించడం పలువురుని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈవిషయమై జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు తక్షణం చర్యలు తీసుకుని, అవినీతి అధికారులకు చరమగీతం పాడాలని లేకపోతే ఇలాంటి అవినీతి పరులు ఏసిబి వలలో చిక్కి, పోలీస్‌ పరువు మర్యాదలు మంటగలసిపోయే అవకాశాలు ఉన్నాయని వాపోతున్నారు. దీనిపై ఎస్పీ రాజశేఖర్‌బాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

 

Tags: Bribery McKinna is to be remembered for SI Srinivasa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *