Bringing the waters of Handriniwa ... Get your debt

హంద్రీనీవా జలాలు తీసుకువచ్చి… మీ రుణం తీర్చుకుంటా

– ఎమ్మెల్యే నవాజ్ బాషా ఉద్ఘాటన

Date:23/05/2020

రామసముద్రం ముచ్చట్లు:

రామసముద్రం మండలానికి హంద్రీనీవా జలాలు తీసుకువచ్చి ప్రజల రుణం తీర్చుకుంటానని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా ఉద్ఘాటించారు. శనివారం మండలంలోని పెద్దకురప్పల్లి పంచాయతీలోని మట్లవారిపల్లి జడ్పి హై స్కూల్ లో ప్రభుత్వం అందచేస్తున్న వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమం మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు నవాజ్ బాషా చేతులు మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామసముద్రం మండలానికి రాబోయే నాలుగు సంవత్సరాలు కాలంలో హంద్రీనీవా జలాలను తీసుకొస్తామన్నారు. మండలంలో సుమారు 6వేలు పై చీలుక మెజార్టీ అందించిన ప్రజలకు రుణం తీర్చుకోవాలంటే హంద్రీనీవా జలాలు తీసుకురావాలన్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు హామీలను 90 శాతం అమలుపరిచి చరిత్రలో నిలిచారని,అలాంటి సీఎం సారధ్యంలో పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కుదురుచీమనపల్లి గ్రామంలో విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి దీక్షా కుమారి, ఎంపిడిఓ శ్రీనివాసులు, ఇన్చార్జ్ తహశీల్దార్ దేవరాజ్, ఏపిఓ గౌరీశంకర్, ఏపిఎం నీరజ ,నాయకులు కేశవ రెడ్డి,సిహెచ్ రామచంద్రారెడ్డి, ఎం.రెడ్డెప్ప, రెడ్డెప్ప నాయుడు, కొండూరు కృష్ణారెడ్డి, లాయర్ రమణారెడ్డి, దిగువపల్లి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పీలేరులో తొలి కరోనా కేసు నమోదు

Tags: Bringing the waters of Handriniwa … Get your debt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *