యాదాద్రి ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు

యాదాద్రి  ముచ్చట్లు:

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కొత్త ఘాట్ రోడ్డు వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. గడచిన కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఈ కొండ చరియలు విరిగిపడ్డాయి. టూరిజం హోటల్ టర్నింగ్ వద్ద కొండచరియలు విరిగి రోడ్డుపై పడ్డాయి. ఈ సమయంలో ఘాట్ రోడ్డు పైన భక్తులు, వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు వెంటనే వాటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం లో భాగంగా ఘాట్ రోడ్డు నిర్మాణం కోసం కొండను తొలిచి కొండ మధ్య నుండి అధికారులు రోడ్డు నిర్మించారు.

 

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags:Broken landslides on Yadadri Ghat Road

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *