అన్నపై తమ్ముడు పెట్రోల్ తో దాడి
మెదక్ ముచ్చట్లు:
ఆస్తుల వివాదంలో మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. సొంత అన్నపైనే తమ్ముడు ఆస్తీ కోసం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున కొల్చారం మండలం అప్పాజీపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తిమ్మక్కపల్లి శంకరయ్యకు ముగ్గురు కుమారులు ప్రవీణ్ , ప్రశాంత్, అశోక్లు ఉన్నారు. ప్రశాంత్ను గ్రామంలోని చింతల రాములు ఇంటికి ఇల్లరికం పంపారు. ఇల్లరికం వెళ్లిన ప్రశాంత్ గత కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో తన అన్న ప్రవీణ్, తమ్ముడు అశోక్లతో గొడవ పడుతున్నాడు.
ఆస్తిలో వాటాలో కోసం అన్నదమ్ముల మధ్ ని తరచూ గొడవలు జరుగుతున్నాయి. శంకరయ్య భార్య లక్ష్మి ముగ్గురు కుమారులు ఆస్తిలో వాటా పంచుకోవాలని తెలిపింది. గొడవల్లో పరాకాష్టగా ప్రశాంత్ అందరూ నిద్రించిన తర్వాత పెట్రోల్ తీసుకువచ్చి ప్రవీణ్ పై పోసి తగలబెట్టాడు.
దాంతో ప్రవీణ్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్తులు ప్రవీణ్ ను మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 90% శాతం కాలినగాయాలతో ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Brother attacked Anna with petrol

