అన్నమయ్య.. కలెక్టరయ్యా..నీవైనా కాపాడవయ్యా.!

– కబ్జా కోరల్లో చిక్కుకున్న చెరువు మొర ఆలకించవయ్యా

 

పీలేరు ముచ్చట్లు:

పీలేరు మండలం బోడుమల్లువారిపల్లి పంచాయతీ పరిధిలోని చెరువు రోజు రోజుకీ కబ్జా కోరల్లో చిక్కుకొని విలవిల లాడుతోంది.రెవెన్యూ అధికారులు గత ప్రభుత్వంలో వలే ప్రస్తుత ప్రభుత్వంలో కూడా చూసీ చూడనట్లు ఉండడంతో చెరువుకు దిక్కు ఎవరు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, వాగులు, వంకలు సక్రమంగా ఉంటేనే ప్రకృతి సస్యశ్యామలంగా ప్రజలను కాపాడుతుందనే ప్రకృతి ధర్మాన్ని గుర్తెరిగి కబ్జా పొరలలో చిక్కుకున్న చెరువు సరిహద్దులను గుర్తించి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రకృతి ప్రేమికులు ప్రజాప్రతినిధులను ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.

Tags: Brother.. Collector.. save yourself too!

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *