అన్న కోసం తమ్ముడు

Brother for Anna

Brother for Anna

Date:24/11/2018
ఖమ్మం ముచ్చట్లు:
కొత్తగూడెం నియోజకవర్గంలో తమ్ముడు జలగం వెంకట్రావు గెలుపు కోసం.. అన్న జలగం ప్రసాదరావు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అన్నీ తానై ఎన్నికల ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన జలగం వెంకటరావును గెలిపించాలని కోరుతూ.. అన్న మాజీ మంత్రి జలగం ప్రసాదరావు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ప్రచారానికి జనాల నుంచి మంచి స్పందన వస్తుండటంతో తన తమ్ముడి విజయంపై ప్రసాదరావు ధీమావ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెంలో విస్తృతంగా పర్యటిస్తూ.. కారు గుర్తుకే ఓటు వేసి టీఆర్ఎస్‌ను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. మహాకూటమిగా జతకట్టిన పార్టీలన్నీ గతంలో చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలన్నారు జలగం ప్రసాదరావు. తెలంగాణ ప్రజలకు మంచి సుదీర్ఘపాలన కావాలంటే తిరిగి టిఆర్ఎస్‌ పార్టీనే గెలిపించాలని జలగం ప్రసాదరావు ఓటర్లను కోరుతున్నారు.
Tags:Brother for Anna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *