భూ వివాదంలో సోదరుడి హత్య

విశాఖపట్నం  ముచ్చట్లు:
డుంబ్రిగుడ  మండలంలోగల సోవ పంచాయితీ దేవుడువలస గ్రామ నివాసులు ఇద్దరు అన్నదమ్ముల మధ్య నెలకున్న భూవివాదం అన్న హత్యకు దారితీసింది.స్థానిక డుంబ్రిగుడ ఎస్ఐ గోపాలరావు తెలిపిన వివరాలు ప్రకారం దేవుడువలస గ్రామస్తుడైన వేమల.వాసుదేవ్(27)జగన్నాథం ఇరువూరు అన్నదమ్ములు,వీరి ఇద్దరి మధ్య భూ సంబంధ గొడవలు ఉన్నాయి.మద్యం మత్తులో ఇంటికి వచ్చిన తమ్ముడు జగన్నాథం అన్న వాసుదేవతో వాగ్వాదానికి దిగాడు.వారి ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో జగన్నాథం కత్తితో వాసుదేవ్ పై దాడి చేశాడు.మేడ,కడుపులో కత్తిపోట్లు దిగడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.అనంతరం జగన్నాథం మృతి చెందాడు అని తెలియగానే వాసుదేవ్ అక్కడి నుంచి పరారయ్యాడు.సమాచారం అందుకున్న డుంబ్రిగుడ పోలీసులు దేముడువలస గ్రామానికి చేరుకుని వాసుదేవ్ మృతదేహాన్ని అరకులోయ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Brother killed in land dispute

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *