తమ్ముడ్ని నరబలి చేసిన అన్న

Date:22/10/2018
భువనేశ్వర్ ముచ్చట్లు:

మూఢ నమ్మకం.. తొమ్మిదేళ్ల బాలుడిని ‘బలి’ తీసుకుంది. ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాలోని బొలంగిర్ జిల్లా సుంధిముండ గ్రామానికి చెందిన ఘనశ్యామ్ రానా (9) అక్టోబరు 13 నుంచి కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  బాలుడి గురించి గాలించిన పోలీసులకు ఉందేయి నదీ తీరంలో తల లేని శరీరం లభించింది. దానికి కొద్ది దూరంలోనే తల కూడా కనిపించింది. అది ఘనశ్యామ్ శరీరరమేనని కుటుంబికులు గుర్తించారు. గ్రామంలో తమకు ఎవరూ శత్రువులు లేరని బాలుడి కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరిపారు.
బాలుడి శరీరంపై ఉన్న వేలి ముద్రల ద్వారా నిందితులను కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఆ వేలి ముద్రలు మృతుడికి అన్న వరసైన శోభాబన్ రానా, బాబాయ్ కుంజన్ రానాల వేలి ముద్రలతో సరిపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో ఘనశ్యామ్‌ను హత్య చేసింది తామేనని నేరం ఒప్పుకున్నారు. టిట్లాగడ్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీపీసీ) సరోజ్ మహాపాత్ర మాట్లాడుతూ.. దుర్గామాతకు బాలుడిని బలి ఇస్తే తమ కోరికలు నెరవేరతాయనే నమ్మకంతో ఈ దారుణానికి ఒడిగట్టారని తెలిపారు. వారిని నమ్మి వెళ్లిన బాలుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, పూజలు చేసి బలి ఇచ్చారన్నారు. హత్య తర్వాత శరీరాన్ని నది ఒడ్డున్న ఇసుకలో కప్పి పెట్టారని తెలిపారు. నిందితులు హత్యకు ఉపయోగించిన కత్తి, మోటర్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.
Tags:Brother to be murdered

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *