డిసెంబరు 6 నుండి బ్రౌన్ గ్రంథాలయ వారోత్సవాలు
-జిల్లా స్థాయిలో విద్యార్థులకు పోటీలు
కడప ముచ్చట్లు :
యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో సి.పి.బ్రౌన్ 139వ వర్ధంతి (డిసెంబర్ 12) సందర్భంగా డిసెంబరు 6 నుండి నుండి బ్రౌన్ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు బాధ్యులు డా.మూల మల్లికార్జున రెడ్డి తెలియజేశారు. ఈ వారోత్సవాలు 6 వతేదీ నుండి 12 వరకు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో నిర్వహించబడతాయన్నారు . 6వ తరగతి నుండి పి.జి.విద్యార్థుల వరకు జిల్లాస్థాయిలో అనేక పోటీలు నిర్వహంచబడతాయి కార్యక్రమ వివరాలు 6 న మంగళవారం ప్రారంభ సమావేశం ఉదయం 9-00 గం లకు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి, అధ్యక్షులుగా కులసచివులు ఆచార్య దుర్భాక విజయ రాఘవ ప్రసాద్, విశిష్ట అతిథిగా విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.కృష్ణారెడ్డి, గౌరవ అతిథిగా వాణిజ్య విభాగం అధ్యాపకులు ఆచార్య ఎస్.రఘునాథ రెడ్డి పాల్గొంటారు.
6,7,8 తరగతుల విద్యార్థులకు ‘పద్య పఠన పోటీ’ ఉంటుంది. పఠన సమయం : 5 ని లు.
అంశం : వేమన, సుమతి శతకాలలోని 6 పద్యాలు (ప్రతి శతకం నుండి మూడు పద్యాలు ఉండాలి) 7వతేదీ బుధవారం ఉదయం 9-00 గం లకు 9,10 తరగతులు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ‘వక్తృత్వం’ పోటీ ఉంటుంది.

వ్యవధి : 5 ని లు
అంశం: 1. వైయస్సార్ కడప జిల్లా ప్రముఖులు (9,10 తరగతుల విద్యార్థులకు) 2. వైయస్సార్ కడప జిల్లా పర్యాటక ప్రాంతాలు (ఇంటర్మీడియట్ విద్యార్థులకు)
8 న గురువారం ఉదయం 9-00 గం లకు 3,4,5 తరగతులు ఇంటర్మీడియట్ నుండి పి.జి.విద్యార్థులకు ‘చిత్రలేఖనం’ పోటీ నిర్వహించబడుతుంది. లేఖన సమయం : 1-30 గంట
అంశం : 1. నచ్చిన చిత్రం (3,4,5 తరగతుల విద్యార్థులకు) 2. మన సంస్కృతి (ఇంటర్మీడియట్ నుండి పి.జి. విద్యార్థులకు) 9న శుక్రవారం ఉదయం 9-00 గం లకు 8,9,10 తరగతుల విద్యార్థులకు ‘ధారణ పరీక్ష’ ఉంటుంది. వ్యవధి:5 ని లు
అంశం : హిందూ, ఇస్లాం, క్రైస్తవ గ్రంథాలలోని విషయాలు
10 నా శనివారం ఉదయం 9-00 గం లకు 8,9,10 తరగతుల విద్యార్థులకు ‘కథా పూరణం’ ఉంటుంది. పూరణ వ్యవధి : 1 గంట
11న ఆదివారం ఉదయం 9-00 గం లకు 8,9,10 తరగతుల విద్యార్థులకు ‘క్విజ్’ ఉంటుంది. సమయం : 1 గంట
అంశం : వైయస్సార్ కడపజిల్లా చరిత్ర, సంస్కృతి, సామాజిక అంశాలు 12 న సోమవారం ముగింపు సమావేశం ఉదయం 10-00గంలకునిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి, విశిష్ట అతిథిగా కులసచివులు ఆచార్య దుర్భాక విజయ రాఘవ ప్రసాద్, అధ్యక్షులుగా విశ్వవిద్యాలయ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య టి.శ్రీనివాస్‌లు విజేతలకు బహుమతుల ప్రదానం చేస్తారని చెప్పారు . కార్యక్రమాన్ని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం బాధ్యులు డా. మూల మల్లికార్జున రెడ్డి నిర్వహిస్తారు మరిన్ని వివరాల కోసం9966624276,9440859872, 9494077736 ఫోన్ నెంబర్లను సంప్రదించాలన్నారు.
Tags; Brown Library Week from December 6
