Natyam ad

జాతికి స్పూర్తి దాయకం బ్రౌన్‌ మహాశయుడు

–  ఆచార్య మునగల సూర్యకళావతి

కడప ముచ్చట్లు:

ఆంగ్లేయుడైన ప్పటికీ ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ తెలుగు భాషా సాహిత్యాలను పునరుద్ధ రించి జాతికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని, భావి పౌరులైన విద్యార్ధినీ విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తెలుగు భాష పట్ల మక్కువ పెంచుకొని ముందుకు సాగాలని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ‘తెలుగు సూర్యుడు’ సి.పి.బ్రౌన్‌ 139వ వర్ధంతిని (డిసెంబర్‌ 12) పురస్కరించుకొని మంగళవారం 6 వతేదీనుండి 12వ తేదీ వరకు బ్రౌన్‌ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తోంది . ఇందులో భాగంగా మొదటిరోజు మంగళవారం  ప్రారంభ సమావేశాన్ని  పద్యపఠన పోటీని నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి మాట్లాడుతూ సి.పి.బ్రౌన్‌ కృషి వల్లనే వేమన తెలుగు నేలలో చిరస్థాయిగా నిలిచిపోయారని, వేమన పద్యాలను ఈనాడు పాఠశాల స్థాయిలో విద్యార్థులు చదువుకోగలుగుతున్నారని అన్నారు. విద్యార్థులు పద్యపఠన పోటీలో పాల్గొనడం చాలా అవసరమని, తెలుగు భాషా సాహిత్యాలపై అభిరుచి పెరగడానికి అది దోహదపడుతుందని అన్నారు.

 

 

 

Post Midle

సభాధ్యక్షులు, విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.కృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశభాషలందు తెలుగు లెస్స అని కీర్తింపబడిరదని, అలాంటి తెలుగుకు గొప్పసేవ చేసిన బ్రౌన్‌ గురించి పాఠశాల విద్యార్థులకు తెలియజేయడంతోపాటు వారిలో దాగున్న నైపుణ్యాలను వెలికితీసే కార్యక్రమాలను సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విశిష్ట అతిథి, వాణిజ్య విభాగం అధ్యాపకులు ఆచార్య ఎస్‌.రఘునాథ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలన్నారు. విజయం గురించి ఆలోచించకుండా విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం ముఖ్యమని సూచించారు. మరో విశిష్ట అతిథి, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కడప అన్నమయ్య పూర్వ గవర్నర్‌ లయన్‌ కె.చిన్నపరెడ్డి మాట్లాడుతూ సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం విద్యార్థులకు అన్ని విధాలుగా ఉపయోగపడే పోటీలను నిర్వహించడం ముదావహ మన్నారు. మండల స్థాయిలో కూడా విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహించాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు లయన్స్‌ క్లబ్‌ తరపున అందిస్తామని తెలియజేశారు. గౌరవ అతిథి, వైవీయూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ఆచార్య కె.గంగయ్య మాట్లాడుతూ విద్యార్థులు పద్యాన్ని భావస్ఫోరకంగా, రాగయుక్తంగా ఎలా పాడాలో తెలుపుతూ సత్యహరిశ్చంద్ర నాటకంలోని ఒక పద్యాన్ని మధురంగా పాడి వినిపించారు. మరో గౌరవ అతిథి, వైవీయూ అకడమిక్‌ ఎఫైర్స్‌ డీన్‌ ఆచార్య ఎ.జి.దాము మాట్లాడుతూ తెలుగు సాహిత్య ప్రక్రియల్లో పద్యానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు.

 

 

 

భావప్రధానంగా చక్కని విరుపులతో పద్యం పాడాలన్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా ఆయన కుడా కొన్ని పద్యాలు గానం చేశారు. మరో గౌరవ అతిథి, వైవీయూ సి.డి.సి.డీన్‌ డా.వై.సుబ్బరాయుడు మాట్లాడుతూ పద్యాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయని, రాగయుక్తంగా నేర్చుకోవడం వల్ల అవి చక్కగా జ్ఞాపకం ఉంటాయన్నారు. ఆయన కూడా సత్యహరిశ్చంద్ర నాటకంలోని ఒక పద్యాన్ని పాడి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం బాధ్యులు డా॥ మూల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ 2017 నుండి సి.పి.బ్రౌన్‌ వర్ధంతిని పురస్కరించుకుని గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వారోత్సవాల ద్వారా సి.పి.బ్రౌన్‌ గొప్పతనాన్ని, బ్రౌన్‌ గ్రంథాలయ విశిష్టతను విద్యార్థులకు తెలియజెప్పడంతోపాటు వారిలోని సృజనాత్మకతను, ప్రతిభా పాటవాలను ఆవిష్కరించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం 6,7,8 తరగతుల విద్యార్థులకు ‘పద్యపఠన’ కార్యక్రమం నిర్వహింపబడిరది. పద్యపఠనం కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా పాత్రికేయులు ఎస్‌.ఎండి.బాష, ఆకాశవాణి అనౌన్సర్‌ ఎస్‌.గంగాధర్‌, వైవియు లలిత కళల విభాగం సంగీత అధ్యాపకులు వలసిగాండ్ల సుధాకర్‌ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బాలవికాస్‌, శాంతినికేతన్‌, నజ్ముల్‌ అమీన్‌, జి.ఆర్‌.టి.జి.వి.కె, విద్యామందిర్‌, పుష్పగిరి (నాగరాజుపేట), పీస్‌ ఇస్లామిక్‌, రామకృష్ణ మిషన్‌, సిద్ధార్థ, శ్రీ విష్ణు విద్యామందిర్‌, కేంద్రీయ విద్యాలయం, శ్రీసత్యసాయి (ఎల్లటూరు) పాఠశాలల విద్యార్థినీవిద్యార్థులు 200 మందికి పైగా పాల్గొని వేమన, సుమతి శతక పద్యాలను పఠించారు. ఈ కార్యక్రమంలో బ్రౌన్‌ గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: Brown Mahasaya is the inspiration of the race

Post Midle