బీఆర్ఎస్ నేతలు దౌర్జన్యం చేస్తున్నారు

రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:


నా అభివృద్ధిని చూసి ఓటేస్తారు అన్న కేటీఆర్ ఈరోజు సిరిసిల్లలో డబ్బు మద్యం పంచుతూ తన నాయకులతో  దౌర్జన్యం చేస్తు డబ్బులు పంచుతున్న వీడియోలను సిరిసిల్ల శాసనసభ అభ్యర్థి రాణి రుద్రమ మీడియా ముందు పెట్టారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉన్న రాణి రుద్రమ ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు..ఇందులో భాగంగా టిఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఓటర్లను మభ్యపెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ దౌర్జన్యంగా డబ్బులు పంచుతున్నారని.. అసలు నా అభివృద్ధిని చూసి ఓటేస్తా అన్న కేటీఆర్ ఈరోజు డబ్బులు, మద్యం పంచడాన్ని తన పార్టీలో ప్రోత్సహిస్తున్నారని,ఓటమి భయంతోనే కేటీఆర్ తన నియోజకవర్గంలో డబ్బులను పంచుతున్నారని.. గమనించిన బిజెపి కార్యకర్తలను చూసి వాళ్ళు పారిపోయారని తెలిపారు.

 

Tags: BRS leaders are committing atrocities

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *