Natyam ad

మహారాష్ట్రలో పోటీకి బీఆర్ఎస్

ముంబై ముచ్చట్లు:


మహారాష్ట్రలో పోటీకి బీఆర్ఎస్ సన్నద్దమవుతోంది. రెండు నెలల్లో స్థానిక సంస్థలు జరుగనున్న నేపథ్యంలో ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇది ఇతర రాష్ట్రాల్లో మొదటి ఎన్నిక కానుంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆ రాష్ట్రంలో కలిసివచ్చే పార్టీలు, సంఘాలతో కలిసి సంప్రదింపులు సైతం త్వరలోనే చేపట్టనున్నట్లు సమాచారం. గడ్చిరోలి, నాందేడు, పర్చానీ జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నట్లు తెలిసింది.జాతీయ రాజకీయాల్లో తొలి అడుగుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత ఏవిధంగానైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయించారో అదేవిధంగా ముందుకు సాగాలని భావిస్తున్నారు. ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్రాల్లో రైతుసంఘాలను బలోపేతం చేయడంతోపాటు పార్టీని పటిష్టం చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు. అందులో భాగంగానే మరో రెండు నెలల్లో మహారాష్ట్రలో మున్సిపల్, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. గడువు ఉండటంతో ఎన్నికల సంఘం నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారుస్తూ క్లీన్ చిట్ వస్తుందని భావిస్తుంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా గ్రామాలైన కార్ల, గంజ్ గావ్ గ్రామాలు, కిన్వాట్, మహోర్ తాలూకా గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలువాలని అక్కడి కలెక్టర్ కు సైతం విజ్ఞప్తులు చేశారు. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని సైతం విన్నవించుకున్నారు. అంతేకాదు కేసీఆర్ జాతీయపార్టీ ప్రకటించిన వెంటనే సంబురాలు సైతం చేసుకున్నారు.

 

 

అంతేగాకుండా మహారాష్ట్రంలోని గడ్చిరోలి, నాందేడు, పర్చానీ జిల్లాల్లో తెలంగాణకు చెందిన ప్రజలు సైతం ఉన్నారు. దీంతో ఈ జిల్లాలపై కేసీఆర్ ప్రధాన దృష్టిసారించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తాచాటి ఇదే అంశాన్ని ప్రచార అస్త్రంగా చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. పోటీకి సైతం ఇప్పటికే పలువురు ముందుకువస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.గుజరాత్ మోడల్ కేవలం ప్రకటనలకే పరిమితం అయిందని… అదంతా గ్లోబల్ అని ప్రజలకు వివరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. గుజరాత్ తోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాల వైఫల్యాలను బృందాలతో సేకరిస్తున్నారు. వీటిని ప్రచార అస్త్రాలుగా చేసుకుని ముందుకు సాగనున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు 24 గంటలు ఉచిత కరెంటు, రైతు బీమా, రైతుబంధుతోపాటు కల్యాణలక్ష్మి, దళితబంధు, మధ్యాహ్న భోజనం, ఆసరా పింఛన్లు ఇలా ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని వివరించేలా ప్రణాళికలను రూపొందిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. ప్రతీ ఇంటికి శుద్దిచేసిన తాగునీరు ఇస్తున్న విషయాన్ని కూడా దేశమంతా ప్రచారం చేస్తామని తెలిపారు.

 

Post Midle

Tags: BRS to compete in Maharashtra

Post Midle

Leave A Reply

Your email address will not be published.