దుబ్బ తండాలో దారుణ హత్య
సూర్యాపేట ముచ్చట్లు :
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (మం)దుబ్బ తండాలో దారుణం చోటుచేసుకుంది.జాటొత్ నాగు నాయక్ అనే వ్యక్తిని దుండగులు నరికి చంపారు.హతుడి భార్య కళ్ళ ముందే ఈ దారుణం జరిగింది.అడ్డుకొబోయిన మృతుడి భార్య పైనా దాడికి తెగబడ్డారు దుండగులు.కాగా అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.గ్రామానికి చెందిన పలువురు మహిళలతో మృతుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనే అనుమానం తో గతంలోనూ పలు మార్లు హత్యా యత్నం చేశారు దుండగులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగుల దాడిలో గాయపడ్డ హతుడి భార్యను ఆస్పత్రికి తరలించారు.
Tags: Brutal murder in Dubba Tanda

