కర్నూలు లో దారుణ హత్య
కర్నూలు ముచ్చట్లు:
కర్నూలు నగరంలో ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. ఆఫీస్ నుంచి వస్తున్న ఉద్యోగిని కత్తులతో వేటాడి చంపేశారు. దాడిలో రౌడీషీటర్ ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కర్నూలు నగరంలోని విద్యుత్ శాఖ ఉద్యోగిగా పనిచేస్తున్న ఇస్మాయిల్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. ఆర్ఎస్ రోడ్డులో కొందరు దుండగులు కత్తులతో వెంటాడి పొడిచి చంపారు. గత నాలుగు నెలల కిందట ఇస్మాయిల్‌పై వడ్డే విజయ్ అనే రౌడీ షీటర్ హత్యాయత్నానికి పాల్పడగా.. అప్పుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ రోజు ఇంటికి వస్తుండగా కత్తులతో పొడవడంతో ఇస్మాయిల్ అక్కడికక్కడే మృతిచెందాడు.ఈ దాడిలో రౌడీషీటర్ విజయ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు రియల్ ఎస్టేట్ లావాదేవీలే కారణంగా భావిస్తున్న పోలీసులు.. విజయ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Brutal murder in Kurnool