నందిగామలో దారుణహత్య
నందిగామ ముచ్చట్లు:
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం జరిగింది. నందిగామ శివారు పల్లగిరి కొండపై ఒక వ్యక్తి ని బీరు సీసాలతో పోడిచి దారుణ హత్య చేసిన ఘటన జరిగింది. హత్య కు గురైన వ్యక్తి కంచికచర్ల మండల కీసర గ్రామానికి చెందిన కుర్రాకుల వెంకటేశ్వరరావు(35)గా గుర్తించారు. సాంబయ్య అనే వ్యక్తి కి మృతుడు డబ్బులు ఇవ్వాలని కారణంతో ఈ హత్య చేశాడని బంధువులు ఆరోపించారు.
Tags: Brutal murder in Nandigama

