ప్రొద్దుటూరులో..దారుణ హత్య

ప్రొద్దుటూరు ముచ్చట్లు:

దారుణ హత్య ఘటన స్థలిలో శరీర ముక్కలు లభ్యం తల మొండెం ఆయుధాలు మాయం.ఈ హతోదంతం ఓ మిస్టరీ తల్లి ఫిర్యాదుతో ప్రధాన నిందితుడి గుర్తింపు ఆధారాల కోసం పోలీసు అన్వేషణ రంగంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో సోమవారం తెల్లారుజామున దారుణ హత్య జరిగింది. వెంకట మహేశ్వర రెడ్డి అనే వ్యక్తిని అత్యంత కిరాతకంగా గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. నేర స్థలిలో రక్తపు మరకలు చిన్న చిన్న మాంసం ముక్కలు మినహా మృతదేహం కనిపించలేదు. హత్యకు ఉపయోగించిన మారణాయుధాలు మాయమయ్యాయి. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిరెడ్డి రామచంద్రారెడ్డి పరారీలో ఉన్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా సాక్ష్యాధారాలు లభించక పోవటంతో ఈ హత్య ఓ మిస్టరీగా మారింది.వివరాల్లోకెళితే. ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో ఓ మాజీ ఎమ్మెల్యే ఇంటి ఎదురుగా నివాసం ఉంటున్న వెంకట మహేశ్వర రెడ్డి ఎర్రగుంట్ల సమీపంలోని భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ లో చేస్తున్నట్లు సమాచారం. ఇతడిని హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి భూమిరెడ్డి రామచంద్రారెడ్డి అని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. కాగా ఇక్కడ విశేషమేమంటే ఘటనా స్థలంలో మృత దేహం కనిపించలేదు. ఇల్లంతా రక్తపు మరకలు, చిన్నచిన్న శరీర భాగాలు ఉన్నాయని, నిందితుడే మృత దేహాన్ని ముక్కలు చేసి తీసుకొని వెళ్ళి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా మృతుని తల్లి ద్వార్సల సుబ్బరత్నమ్మ తన కుమారుని చంపింది రామచంద్రారెడ్డి అంటూ ఆరోపిస్తోంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే గత 20 ఏళ్లుగా రామచంద్రారెడ్డి, సుబ్బరత్నమ్మ వైఎంఆర్ కాలనీలో ఓకే ఇంటిలో సహజీవనం చేస్తున్నారని సమాచారం. దీంతో ఈ హత్య వెనక అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిస్టరీగా మారిన ఈ కేసును చేధించేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు.

 

 

 

Tags:Brutal murder in Proddutur

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *