అక్రమ సంబంధం నేపధ్యంలో వ్యక్తి దారుణ హత్య
పామర్రు ముచ్చట్లు:
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలంలో దారుణ హత్య జరిగింది. అక్రమ సంబంధం నేపథ్యంలో యాకమూరు కు చెందిన శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి లు ఇద్దరూ ఆళ్ళవారి పాలెం కు చెందిన మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. అదే మహిళతో ఇంటి వద్ద శ్రీనివాస రెడ్డి మృత దేహం రక్తపు మడుగులో పడివుండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీకాంత్ రెడ్డి, మహిళ పరారీలో ఉన్నట్లు సమాచారం. వారిద్దరూ కలిసి హత్య చేసినట్లుగా గ్రామస్థులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళకు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. డాగ్ స్వాడ్, క్లూస్ టీమ్ లతో పోలీసులు విచారిస్తున్నారు.
Tags: Brutal murder of a person in the context of illicit relationship

