Natyam ad

ఫైనాన్సర్ దారుణ హత్య

మేడ్చల్ ముచ్చట్లు:


నగరశివారులోని దొమ్మర పోచంపల్లి చెరువు దగ్గర ఓ వ్యక్తి రక్తసిక్తంగా అనుమానాస్పద స్థితిలో  మృతిచెందిన దృశ్యాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు  సమాచారమిచ్చారు.. సంఘటనా  స్థలానికి చేరుకున్న  పోలీసులు   ప్రాథమిక దర్యాప్తులో  మృతుడు దుండిగల్  కు చెందిన వెంకటేష్ గౌడ్( 40) సంవత్సరాల  వ్యక్తి  గా గుర్తించారు.ఆదివారం రాత్రి  9 గంటల సమయంలో  ఇంటి నుండి బయటికి వెళ్లినట్లు,  రాత్రే  శరీరం పై 3 కత్తి పోట్లు తో   దారుణ హత్య కు గురైనట్లు  పోలీసులు గుర్తించారు.. స్థానికంగా  సెంట్రింగ్, మెటీరియల్  కిరాయికి ఇస్తూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడని సమాచారం..కేసు నమోదుచేసుకొన్న పోలీసులు      డాగ్ స్వ్కాడ్ తో  స్థలాన్ని పరిశీలించారు.

 

Tags: Brutal murder of financier