సింగరేణి కార్మికుడి దారుణ హత్య

నిందితుల కోసం  రెండు బృందాల గాలింపు


గోదావరిఖని ముచ్చట్లు:

ఓ సింగరేణి కార్మికుడిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. హంతకులు  రెండు ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి వచ్చారని సమాచారం.  ఘటన  శనివారం తెల్లవారు జామున పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగ నగర్ లో చోటు చేసుకుంది. అయితే అందరు గుర్తు తెలియని ఆయుధంతో తలపై పొడిచి చంపారు అనుకుంటూ ఉండగా మరో విషయం వెలుగలోకి వచ్చింది. శ్రీరాంపుర్ అర్ కే 7 లో జనరల్ మజ్దూర్ గా పని చేస్తున్న కొరకొప్పుల రాజేందర్ అనే కార్మికుడిని తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో  గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బెడ్ పై పడుకొని ఉన్న రాజేందర్ ను తల భాగంలో గన్ తో 2 రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంతకుముందే మృతుడి భార్య రవళి బాత్ రూమ్ కు బయటకు వచ్చింది. ఘటన స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ రూపేష్ పరిశీలించారు.  నిందితులు ఉపయోగించిన గన్ కు  లైసన్స్ ఉందా..లేదా అని విచారిస్తున్నామని,  నిందితుల కోసం 2 పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నారని డీసీపీ తెలిపారు. దీంతో పాటు గత వారం రోజుల కిందట సైతం ఇంటికి కరెంట్ షాక్ పెట్టి  రాజేందర్ ను  హత్య చేయడానికి ప్రయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలం వద్ద ఏసీపీ గిరి ప్రసాద్. ఒకటవ పట్టణ సీఐలు రమేష్ బాబు. రాజ్ కుమార్ గౌడ్ లతో కలసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: Brutal murder of Singareni worker

Leave A Reply

Your email address will not be published.