ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి-జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్.లత

 
-ప్రజావాణి లో వివిధ సమస్యలపై 26 వినతులు
 
జగిత్యాలముచ్చట్లు:
 
 
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా వాణి కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నట్లు జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్. లత తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించగా జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజల సమస్యల పరిష్కారానికి అదనపు కలెక్టర్ , జిల్లాస్థాయి ఉన్నత అధికారులకు వినతులు అందించారు. ప్రజావాణి కార్యక్రమానికి వివిధ మండలాల నుండి 26 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని
కరోనా తీవ్రత దృష్ట్యా రద్దు చేసి ప్రస్తుతం మళ్లీ ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత,తోపాటు జిల్లా వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
 
Tags:BS Lata, Additional Collector, Prajavani-District, is responsible for resolving public issues

Leave A Reply

Your email address will not be published.