అధికారుల అలసత్వం వల్ల బీసీ విద్యార్థులకు అన్యాయం

BSc students are unfair because of the tiredness of the authorities

BSc students are unfair because of the tiredness of the authorities

 Dare:13/07/2018
అమరాసవతి   ముచ్చట్లు:
అధికారుల అలసత్వం వల్ల ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో రిజర్వేషన్ వర్గాలకు ముఖ్యంగా బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ చైర్మన్ గుండుమల తిప్పేస్వామి చెప్పారు. అమరావతిలోని వెలగపూడి శాసనసభ భవనం మొదటి అంతస్తులోని కమిటీ హాలులో శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు మెడికల్ కౌన్సిలింగ్ లో జరుగుతున్న అన్యాయంపై నెల రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోందన్నారు. బీసీ విద్యార్థులు, బీసీ సంఘాల వాదనలో న్యాయం ఉందన్నారు. ఉయయం జరిగిన కమిటీ సమావేశంలో ఈ అంశంపై ఉన్నత విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఎన్టీఆర్ వైద్య విశ్యవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సీ.వెంకటేశ్వర రావు, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ వి.రామారావు, ఇతర ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు. 2001లో సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా రూపొందించిన 550 జీఓ ప్రకారం 16 ఏళ్లుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మెడికల్ కౌన్సిలింగ్ లో సీట్లు భర్తీ చేశారని చెప్పారు. 2017 ఆగస్ట్ 30 కోర్టు ఇన్ టెర్మ స్టే ఇవ్వడం వల్ల ఈ సమస్య తలెత్తిందన్నారు. స్టే ఎత్తివేయడానికి కావలసి మద్దతు డాక్యుమెంట్లు, ఆధారాలు  ఉన్నత విద్యాశాఖ వద్ద ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పించి స్టే ఎత్తివేయిస్తామని చెప్పారు. రిజర్వేషన్ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన కౌన్సిలింగ్ ఆపివేయమని ఆదేశించారన్నారు. కొందరు అధికారులు బాధ్యతగా వ్యవహరించకపోవడంతో స్టే ఎత్తివేయించడంలో ఇంత జాప్యం జరిగిందన్నారు. స్టే ఎత్తివేసిన తరువాత రీ కౌన్సిలింగ్ జరిపి రిజర్వేషన్ వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పారు. జాప్యానికి కారకులైన వారిపై వచ్చే కమిటీ సమావేశంలో చర్యలు తీసుకుంటామన్నారు.
 రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరుగకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు జరిగే విధంగా చూస్తామన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అన్యాయం జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల కమిటీ విజయనగరం జిల్లాలో పర్యటించిందని, అక్కడ అన్ని అంశాలను పరిశీలించామన్నారు. రిజర్వేషన్లను ఎవరు ఇష్టం వచ్చినట్లు వారికి అనుకూలంగా మలచుకోవడానికి వీలులేదని తిప్పేస్వామి హెచ్చరించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలు పి.అనంత లక్ష్మి, డాక్టర్ బి.అశోక్, బి.రామమూర్తి, ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు పాల్గొన్నారు.
అధికారుల అలసత్వం వల్ల బీసీ విద్యార్థులకు అన్యాయం https://www.telugumuchatlu.com/bsc-students-are-unfair-because-of-the-tiredness-of-the-authorities/
Tags:BSc students are unfair because of the tiredness of the authorities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *