ప్రైవేటుకు దీటుగా బీఎస్ఎస్ఎల్ ప్లాన్

BSL Plan to privately

BSL Plan to privately

Date:15/04/2019
ముంబై ముచ్చట్లు :
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎస్ఎల్.. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని ఉండొచ్చు. ఇతర సమస్యలు వెంటాడుతూ ఉండొచ్చు. కానీ దేశంలోని ప్రధాన టెలికం సర్వీస్ ప్రొవైడర్లలో ఇది కూడా ఒకటనే విషయం మనం గుర్తుకు పెట్టుకోవాలి. బీఎస్ఎన్ఎల్ తన ప్రత్యర్థులైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌కు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. జియో గిగాఫైబర్, ఎయిర్‌టెల్ వి-ఫైబర్ బ్రాడ్‌బాండ్ ప్లాన్లకు కౌంటర్ ఇచ్చేలా రెండు కొత్త బ్రాడ్‌బాండ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. రూ.777 ప్లాన్ ఒకటైతే.. రూ.1,277 ప్లాన్ మరొకటి. ప్రస్తుత, కొత్త కస్టమర్లకు ఈ ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. కంపెనీ ఈ ప్లాన్లతోపాటు పలు ఇతర ప్లాన్లను కూడా కస్టమర్లకు అందిస్తోంది. ఈ ప్లాన్ల కింద 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 170 జీబీ డేటా పొందొచ్చు. ఈ ప్లాన్లతోపాటు ఏడాది అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తోంది. యూజర్లు రూ.777 ప్లాన్ కింద నెలకు 500 జీబీ డేటా పొందొచ్చు. కంపెనీ తొలి ఎఫ్‌టీటీహెచ్ బ్రాడ్‌బాండ్ ప్లాన్ ఇదే. ఈ ప్లాన్ కింద 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటా పొందొచ్చు. 500 జీబీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. దీని ధర నెలకు రూ.777. 1,277 ప్లాన్ కింద యూజర్లు 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 750 జీబీ డేటా పొందొచ్చు. ఈ ప్లాన్ కోసం నెలకు రూ.1,277 చెల్లించాలి. 40 జీబీ ప్లాన్ తీసుకుంటే.. రోజుకు 40 జీబీ డేటా పొందొచ్చు. డేటా స్పీడ్ 100 ఎంబీపీఎస్. ఈ ప్లాన్ ధర నెలకు రూ.2,499. 50 జీబీ ప్లాన్‌లో రోజుకు 50 జీబీ డేటా పొందొచ్చు. డేటా స్పీడ్ 100 ఎంబీపీఎస్. ఈ ప్లాన్ ధర నెలకు రూ.3,999. 80 జీబీ ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రోజుకు 80 జీబీ డేటా పొందొచ్చు. ఈ ప్లాన్ ధర నెలకు రూ.5,999. 120 జీబీ ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రోజుకు 120 జీబీ డేటా పొందొచ్చు. ఈ ప్లాన్ ధర నెలకు రూ.9,999. ఇక 170 జీబీ డేటా ప్లాన్ ధర నెలకు రూ.16,999గా ఉంది. ఈ ప్లాన్ కింద 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రోజుకు 170 జీబీ డేటా పొందొచ్చు.
Tags:BSL Plan to privately

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *