గెలుపోటములపై బీఎస్‌పీ, బీఎల్‌ఎఫ్‌ ప్రభావం

BSP and BLF effect

BSP and BLF effect

Date:23/11/2018
వరంగల్ ముచ్చట్లు:
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ, బీఎల్‌ఎఫ్‌లు గెలుపోటములపై ప్రభావం చూపబోతున్నాయి. సీపీఎం ఏర్పాటు చేసిన బీఎల్‌ఎఫ్ 119 నియోజక వర్గాల్లో అభ్యర్దులను బరిలోకి దింపింది. జాతీయ పార్టీ అయిన బీఎస్‌పీ కూడా 82 నియోజక వర్గాల్లో పోటీలో ఉండబోతుంది. ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లను ఆశించి భంగపడ్డ అసంతృప్తివాదులు, ఆశావహులు అత్యధికంగా బీఎస్‌పీ టికెట్లపై పోటీ చేయబోతున్నారు. కొందరు ఇతర పక్షాల ఆశావహులు బీఎల్‌ఎఫ్ నుంచి రంగంలో ఉండబోతున్నారు.  ఈ రెండు పక్షాలు ప్రధాన పార్టీల ఓట్లను కొంత మేరకు చీల్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీఎల్‌ఎఫ్ ఏర్పాటుతో ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపులకు తావు లేకుంగా పోయింది. సీపీఎం ప్రాబల్యం ఉన్న చోట్ల బీఎల్‌ఎఫ్‌కు ఓట్లు పడే అవకాశం ఉంది. సీపీఐ ఓట్లు సీపీఎంకు పడే అవకాశం లేదు. అదే విధంగా సీపీఎం ఓట్లు సీపీఐకి బదలాయించడానికి ఏ మాత్రం అవకాశం లేకుండా పోయింది. ఈ రెండు వామపక్ష పార్టీలు కొన్ని నియోజక వర్గాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్దుల గెలుపు, ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
బీఎస్‌పీకి తెలంగాణ అంతటా అంతో ఇంతో బలం ఉంది. బహుజనులు ఏటేటా బీఎస్‌పీకి ఓట్లు వేస్తూ వస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో బహుజనుల ఓట్లు  కొంత వరకు బహుజన వామపక్ష కూటమి అభ్యర్దులకు పడే అవకాశం ఉన్నప్పటికీ బీఎస్‌పీ అభిమానుల్లో అత్యధికులు వామపక్షాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున ఓట్ల బదలాయింపు ఆశించిన మేరకు ఉండక పోవచ్చంటున్నారు. కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ మధ్యన ఓట్ల బదలాయింపులకు ఇప్పటికే కార్యాచరణ సిద్దమైంది. రాష్ట్ర స్ధాయిలో కుదిరిన ఒడంబడికలు క్షేత్ర స్దాయికి చేరవేస్తున్నారు. సీపీఎం, బీఎల్‌ఎఫ్‌కు పడే ఓట్లు ఎవరికి మేలు చేస్తాయనేది ఎన్నికల ఫలితాలు వస్తే కాని విశ్లేషించలేమంటున్నారు. 2014 ఎన్నికల్లో బీఎస్పీకి 4.58 లక్షల ఓట్లు, సీపీఎంకు 4.07 లక్షల ఓట్లు, సీపీఐకి 2.5.4 లక్షల ఓట్లు పడ్డాయి. ఈ ఓట్ల ప్రభావం 2018 ఎన్నికలపై ఉంటుందని భావిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్షాలు ఏకమైనప్పటికీ, కూటమికి సీపీఎం దాని నేతృత్వంలోని బీఎల్‌ఎఫ్‌లు దూరంగా ఉండటం, ఒంటరిగా బరిలోకి దిగడంతో ఎవరికి వారు ఊహాజనితమైన విశ్లేషణలు చేస్తున్నారు. సీపీఎం ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ – కాంగ్రెస్‌కు సమాంతర దూరం పాటిస్తుంది.
సీపీఐతో పూర్తిగా విడిపోయింది.  అభ్యర్దుల గెలుపుకంటే కూడా బహుజనుల ఓట్లు కూడగట్టాలనే ఆలోచనతో రంగంలోకి దిగింది. దీంతో ఇతర పక్షాలు సీపీఎంతో జత కట్టడానికి ఇష్టపడటం లేదు. సిద్ధాంతపరమైన నిర్ణయం అయినందున సీపీఎం ఊసే ఎత్తేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు సిద్దంగా లేమంటున్నాయి. బీఎస్‌పి టికెట్లపై పోటీ చేస్తున్న వారిలో అత్యధికులు కాంగ్రెస్ నాయకులేనని తేలింది. కాంగ్రెస్ పార్టీ 100 నియోజక వర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్దులను ఎంపిక చేసి బీఫారాలను అందచేసినప్పటికీ అందరినీ సంతృప్తి పర్చలేక పోయింది. దీంతో రెబెల్స్‌గా రంగంలో ఉండాలనుకుంటున్న వారు బీఎస్‌పీ టికెట్లను పొందారు. ఆ పార్టీ గుర్తుతోనే పోటీ చేయబోతున్నారు. వారిలో  బీఎస్‌పీ గుర్తుపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఆశావహుల్లో అత్యధికులు గెలుస్తారని, అధికారికంగా బీఫారాలు పొందిన వారిలో కొందరు రెబెల్స్ చేతిలో ఓడిపోయే ఆవకాశం లేకపోలేదని అంటున్నారు. ఈ విధమైన విశ్లేషణల నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశావహులు, అసంతృప్తివాదుల బుజ్జగింపు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
గురువారంతో నామినేషన్ల విరమణ గడువు ముగియబోతున్నందున కొందరిపై గట్టి ఒత్తిడి తెస్తున్నారు. బేరసారాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.  అత్యధికులైన ఆశావహులు టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్దులుగా నామినేషన్ దాఖలు చేశారు. వారిని పోటీ నుంచి విరమింపజేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు. కొంత మంది కాంగ్రెస్ ఆశావహులు బీఎస్‌పీ టికెట్‌పై నామినేషన్ వేశారు. కూటమి ఆశావహులే అత్యధికంగా ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం 3,584 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అందులో స్వతంత్రలు, ఇతరులు 2,441 మంది వరకు ఉన్నారు. గుర్తింపు పొందిన 10 రాజకీయ పార్టీల నుంచి1203 మంది నామినేషన్లు వేశారు. అసెంబ్లీలోని 119 నియోజక వర్గాలకు గాను టీఆర్‌ఎస్ పక్షాన 272 మంది, కాంగ్రెస్ నుండి 300 మంది నామినేషన్‌లు వేశారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డవారిలో అత్యధికులు బిఎస్‌పి బీఫారాలను దక్కించుకున్నారు. ఈ విధంగా బిఎస్‌పి టికెట్ పై నామినేషన్ వేసినవారంతా ఎన్నికల బరిలో ఉంటారని భావిస్తున్నారు. బుజ్జగింపులకు అత్యధికులు లొంగడం లేదని వివిధ రాజకీయ పక్షాలు పేర్కొంటు న్నాయి. గత కొంత కాలంగా నియోజక వర్గాల్లో మంచి పట్టు సాధించుకొని అభ్యర్ధిగా బరిలో ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత టికెట్ రాకపోవడంతో పార్టీల అధినాయకత్వంపై గుర్రుగా ఉన్నారు.
బీఎస్‌పీ నుంచి పోటీ చేస్తున్న వారిలో అత్యధికులు కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారేనని ఆ పార్టీ వర్గాలు పేర్కొం టున్నాయి. వివిధ సమీకరణల కారణంగా కొందరికి ఆశించిన మేరకు టికెట్ ఇవ్వలేక పోయామని, వారు గెలిచే పరిస్దితే ఉంటే బుజ్జగించాల్సిన అవసరం కూడా ఉండబోదని, బుజ్జగింపులకు లొంగే వారైతే బిఎస్‌పి టికెట్  ఎందుకు తెచ్చుకుంటారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మంలో భాగంగా 94 స్దానాల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ అనేక ఒత్తుడులు, సమాజిక సమీకరణలు, పార్టీల బలాలు, బలహీనతలను బేరీజు వేసుకొని 100 నియోజక వర్గాల్లో తమ అభ్యర్దులు పోటీ చేయడానికి బీఫారాలను అందచేసింది. మరో డజన్ మందికి పైగా బిఎస్‌పి టికెట్‌తో, స్వతంత్ర అభ్యర్దులుగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఇలాంటి వారి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆచీతూచీ వ్యవహరిస్తుందని అంటున్నారు.
అధికారికంగా బరిలో ఉన్న అభ్యర్ది గెలిచే అవకాశం లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్దిగా, బిఎస్‌పి అభ్యర్దిగా బరిలో ఉన్నవారిని బలపరిచి గెలిపించుకొనే ఆలోచన కూడా పార్టీకి ఉందని అంటున్నారు, ఈ విధంగా గెలిచిన వారు పార్టీకి ఎట్టి పరిస్ధితిలోనూ దూరం కాబోరని , గెలిచిన తర్వాత పార్టీ ఖాతాలోనే ఉంటారని అంటున్నారు. గతంలో  ఈ విధంగా గెలిచి పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నవారు అనేక మంది ఉన్నారని ఊటంకిస్తున్నారు. రెబల్స్ విషయంలో   కూటమి పక్షాలు ఆచీతూచీ వ్యవహరి స్తున్నాయి. కొంత మంది రెబల్స్‌ను అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ప్రోత్సహించే అవకాశం ఉంది.  స్నేహపూ ర్వక పోటీలపై కూడా కూటమి పక్షాలు పెద్దగా దృష్టి కేంద్రీకరించడం లేదు. ఎవరు గెలిచినా కూటమి ఖాతా లో జమ కావలసిందే అనే ఆలోచనతో ఉన్నారు. ప్రధా నంతా బీఎస్‌పీ టికెట్లను పొందిన కాంగ్రెస్ వాదులు అత్యధికంగా గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
Tags:BSP and BLF effect

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *