భాజపా ఎమ్మెల్యే అభ్యర్థికి చేదు అనుభవనం

BSP MLA is a bitter experience to the candidate

BSP MLA is a bitter experience to the candidate

-ఆశీర్వాదం తీసుకునేందుకు వంగిన అభ్యర్థి మెడలో చెప్పుల దండ
Date:20/11/2018
నగడా ముచ్చట్లు:
మధ్యప్రదేశ్‌లోని నగడాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన భాజపా ఎమ్మెల్యే అభ్యర్థికి చేదు అనుభవనం ఎదురైంది. గ్రామస్థుల దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకునేందుకు వంగిన భాజపా అభ్యర్థి మెడలో ఓ వ్యక్తి చెప్పుల దండ వేసి అవమానపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నగాడా-ఖచురాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపాకు చెందిన దిలీప్‌ సింగ్‌ షెఖావత్‌ బరిలో ఉన్నారు.ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజల ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఆయన ఆ ప్రాంతానికి వెళ్లారు. దీంతో అందరూ ఆయనకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నిలబడి ఉన్న గ్రామస్థుల ఆశీర్వాదం తీసుకునేందుకు అభ్యర్థి కిందకు వంగారు. ఆ సమయంలో ఓ వ్యక్తి షెఖావత్‌ను కలిసేందుకు దగ్గరకు వచ్చి వెంటనే చెప్పుల దండను మెడలో వేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన షెఖావత్‌ అనుచరులు అతడిని పట్టుకొని కొట్టారు. అయితే.. అసలు ఆ వ్యక్తి అలా చేయడానికి గల కారణం తెలియరాలేదు.మధ్యప్రదేశ్‌లో నవంబరు 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయారు. డిసెంబరు 11న ఫలితాలు వెలువడనున్నాయి.
Tags:BSP MLA is a bitter experience to the candidate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *