లోన్ యాప్ కు బీటెక్ విద్యార్థి బలి
గుత్తి ముచ్చట్లు:
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా గుత్తి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది..అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన అయ్యన్న, శారద దంపతుల కుమారుడు అఖిల్ (22) బెంగళూరులోని గీతం యూనివర్సిటీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులు తాళలేక మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ,స్నేహితులు చెపుతున్నారు. నిన్న ఉదయం ఇంటి నుండి బయటకు వచ్చాడని స్నేహితులకు ఫోన్ చేసి తాను ఇక ఉండను అందరికీ దూరంగా వెల్లిపోతానని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడని స్నేహితులు తెలిపారు గుత్తి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు కిందపడి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై గుత్తి రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: BTech student victim to loan app

