బబుల్‌గమ్’ అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్.

బబుల్‌గమ్’ అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్.

హైదరాబాద్ ముచ్చట్లు:

ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బబుల్‌గమ్’. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు రవికాంత్ పేరేపు విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
బబుల్‌గమ్ తో జర్నీ ఎలా మొదలైయింది ?
‘క్షణం’ తర్వాత కృష్ణ అండ్ లీల చేశాను. నిజానికి కృష్ణ అండ్ లీల థియేటర్స్ లో రిలీజ్ కావాల్సింది. కానీ కోవిడ్ లాక్ డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలయింది. లాక్ డౌన్ కారణంగా యాక్టర్స్ షెడ్యుల్స్ మారిపొయాయి. చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఎక్కువైపోయాయి. ఈ క్రమంలో కొత్తవాళ్ళతో చేయడానికి ‘బబుల్‌గమ్’ కథ రాశాను. రోషన్ నాకు ముందే తెలుసు. తను హీరోగా పరిచయం అవుతున్నారని తెలిసి రోషన్ కలిశాను. ఈ కథకు తను పర్ఫెక్ట్ ఫిట్ అనిపించాడు. తర్వాత  మా జర్నీ మొదలైయింది. జూలైలో షూటింగ్ మొదలుపెట్టి సినిమాని చాలా ఫాస్ట్ గా చేశాం. ‘బబుల్‌గమ్’ అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్.
ఈ కథని కొత్త వాళ్ళతోనే చేయడానికి కారణం ?
ఇది కొత్తవాళ్ళతోనే చేయాల్సిన కథ. 22 ఏళ్ల తర్వాత కాలేజ్ పూర్తి చేసుకొని రియల్ వరల్డ్ లోకి అడుగుపెడతాం. అప్పటి వరకూ మన ఫ్యామిలీ, పేరెంట్స్ మనల్ని ప్రోటక్ట్ చేస్తారు. ఒక్కసారి మన ప్యాషన్ ని వెదుక్కుంటూ బయటికి వెళ్ళినపుడు అంతా కొత్తగా అనిపిస్తుంది. ఈ క్రమంలో  ఎలాంటి కెరీర్ ని ఎంచుకోవాలి ?  డబ్బులు వుంటే సరిపోతుందా ? మనకి ఇష్టమైనది చేయాలా?  ఇలా చాలా కన్ఫ్యుజన్స్ వుంటాయి. ఇలాంటి సమయంలో అనుకోకుండా జీవితంలో ప్రేమ వస్తే ఎలా డీల్ చేస్తాం.. ఇలాంటి కథకు కొత్తవాళ్ళు వుంటేనే బెటర్ అనిపించింది.
‘బబుల్‌గమ్’ టైటిల్ పెట్టడానికి కారణం ?
ఈ సినిమాలో బబుల్‌గమ్ పై ఒక డైలాగ్ వుంది. లవ్, రిలేషన్ షిప్స్ బబుల్‌గమ్ లాంటిది.. మొదట్లో తియ్యగా వుంటుంది. తర్వాత అంటుకుంటుంది. (నవ్వుతూ)
ఇది ప్రేమకథా ? లేదా ఒక కుర్రాడి జీవితంలోని  ప్రేమ ఒక భాగంగా ఉంటుందా ?
ఇది ప్రధానంగా ప్రేమకథ. ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఇది రాక్ స్టార్ లా ఉంటుందా ? లేదా ఒక మ్యుజిషియన్ ఫిల్మ్ లా వుంటుందా అని అడిగారు. అయితే ఇది ప్రేమకథ ప్రధానంగా వుండే రిలేషన్ షిప్ డ్రామా.
ట్రైలర్ లో హీరో క్యారెక్టర్ ని అర్జున్ రెడ్డిలా అగ్రెసివ్ గా చూపించారు కదా ? ఈ కథలో అలానే ఉందా ?
అర్జున్ రెడ్డి వేరు.. ఇది వేరు. అర్జున్ రెడ్డిలా ఇందులో హీరోకి ఎంగర్ ఇష్యుస్ ఏమీ లేవు. అయితే అర్జున్ రెడ్డికి కోపం రావడంతో ఎవరికీ కోపం వచ్చినా అర్జున్ రెడ్డినే అంటున్నారు. కోపం అందరికీ వస్తుందికదండీ.(నవ్వుతూ)
రోషన్ నటన గురించి ఇప్పటికే చాలా మంది అభినందిస్తున్నారు.. ఒక ఆడియన్ గా మీరేం చెబుతారు ?
రోషన్ ఫెంటాస్టిక్. ట్రైలర్ లో చూసింది పది శాతమే. సినిమాలో చాలా అద్భుతంగా చేశాడు. రోషన్, మానస ఇద్దరూ చాలా చక్కగా నటించారు. అలాగే ఇందులో నటించిన మిగతా నటీనటులు కూడా చక్కని ప్రతిభ కనపరిచారు.
సుమ గారు రషస్ చూసి ఏమైనా సూచనలు చెప్పారా ? కొంచెం బోల్డ్ కంటెంట్ కూడా వుంది కదా?
లేదండీ. వారి ఇన్వాల్మెంట్ ఏమీ లేదు. మొత్తం రోషన్ కే వదిలేశారు. నన్ను, రోషన్ ని బలంగా నమ్మారు.
శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ గురించి ?
శ్రీచరణ్ నాకు స్కూల్ లో ఉన్నప్పటి నుంచి తెలుసు. ఒకే ఊరు వాళ్ళం కావడం వలన మొదటి నుంచి ఆ కంఫర్ట్ కుదిరింది. క్షణం, కృష్ణ అండ్ లీల.. ఇప్పుడు ‘బబుల్‌గమ్’ కి చేశాడు. హాబీబీ, జాను, ఇజ్జత్ పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకో రెండు పాటలు వున్నాయి.
హీరోయిన్ మానస చౌదరి గురించి ?
మానస తెలుగమ్మాయి. చాలా అద్భుతంగా నటించింది. తనకి తెలుగు అర్ధం కావడం వలన మన రైటింగ్ లోని సబ్ టెక్స్ట్ కూడా తనకి అర్ధమౌతుంది. దీంతో మరింత ఈజీ అయ్యింది. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా వస్తున్నారు. దీంతో నేటివిటీ ఇంకొంచెం బిలీవబుల్ గా వుంటుంది.
ప్రొడక్షన్ హౌస్ గురించి ?
మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వండర్ ఫుల్ నిర్మాణ సంస్థలు. సినిమాకి కావాల్సిన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు. పెట్టాల్సిన దానికంటే ఎక్కువ బడ్జెట్ పెట్టారు. ప్రొడక్షన్, ప్రమోషన్స్ చాలా అద్భుతంగా చేశారు.
చిరంజీవి గారిని కలవడం ఎలా అనిపించింది ?
నిజంగా నాకు అది ఫ్యాన్ బాయ్ మూమెంట్. చిరంజీవి గారికి నేను డై హార్డ్ ఫ్యాన్ ని. ఇజ్జత్ పాట ఆయనకి చాలా నచ్చింది.
సలార్ లాంటి పెద్ద సినిమా థియేటర్స్ లో వుంది కదా.. డిసెంబర్ 29 పర్ఫెక్ట్ రిలీజ్ అనుకుంటున్నారా ?
సలార్ లో లేనిది మా సినిమాలో వుంది. మా సినిమాలో లేనిది సలార్ లో వుంది.(నవ్వుతూ) మా టీజర్ రిలీజ్ చేసిన తర్వాత చాలా బజ్ వచ్చింది. అలాగే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ బజ్ ఉన్నప్పుడే రిలీజ్ చేయాలని భావించాం. ఈ బజ్ తగ్గట్టే సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. సినిమాలో ఇంటర్వెల్, క్లైమాక్స్ హైలెట్ గా వుంటాయి. ప్రేక్షకులని బలంగా హత్తుకుంటాయి.
సినిమాలు చేయడంలో స్పీడ్ ని పెంచాలని భావిస్తున్నారా ?
ఖచ్చితంగా. సినిమా సినిమాకి కొంత గ్యాప్ అయితే వచ్చింది. అయితే పరిశ్రమలో పరిస్థితులుని అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇకపై స్పీడ్ ని పెంచడానికి ప్రయత్నిస్తాను.
మీకు ఇష్టమైన జోనర్ ?
డ్రామా.. యాక్షన్ డ్రామా.
కొత్త సినిమాల గురించి ?
ప్రస్తుతానికి నా ద్రుష్టి ‘బబుల్‌గమ్’ విడుదలపై వుంది. ఈ సినిమా విడుదల తర్వాత కొత్త ప్రాజెక్ట్ పై ద్రుష్టి పెడతాను.

 

Tags: Bubblegum’ is a subject that connects everyone.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *