26 నుంచి బడ్జెట్ సమావేశాలు

Date:13/06/2019

గుంటూరు ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దూకుడుగా ఉన్నారు. కేబినెట్ కూర్పు, కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతున్న జగన్.. ఏకంగా బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారట. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారట. 20 రోజుల పాటు ఈ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయని తెలుస్తోంది.  ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18తో ముగుస్తాయి. తర్వాత వారం పాటూ విరామం తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారట. బడ్జెట్‌కు సంబంధించిన కసరత్తు చేసే పనిలోనూ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. జులై 10తో కొత్త బడ్జెట్‌ని ప్రవేశపెట్టాల్సి ఉంది. కొత్త ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జూన్ నెలాఖరుకు ముగియనుంది. అందుకే బడ్జెట్ సమావేశాలపై కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ. 1, 91,63,000 కోట్లతో గత ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కొత్త మంత్రివర్గంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల బాధ్యతలు దక్కాయి. మరి ఈ బడ్జెట్‌లో వైసీపీ హామీలు, నవరత్నాలకు ఏ మేరకు కేటాయింపులు ఉంటాయన్నది ఆసక్తిగా మారింది.

 

ఖరీఫ్ పై కోటి ఆశలతో రైతన్న

 

Tags: Budget meetings from 26

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *