Natyam ad

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుగ్గోత్సవం

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఏప్రిల్ 20 నుండి 22వ తేదీ వ‌ర‌కు బుగ్గోత్సవం ఘనంగా నిర్వ‌హించ‌నున్నారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవంలో ప్ర‌తి రోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఆలయంలోని బుగ్గ వద్దకు శ్రీదేవి, భూదేవి సమేత  శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేపు చేస్తారు. మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సమర్పణ, ఆస్థానం నిర్వహించ‌నున్నారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఉభయనాంచారులతో కలసి శ్రీవారి ఊంజలసేవ, అనంతరం బుగ్గ వద్ద భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు శ్రీ మహలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ఆస్థానం నిర్వహించనున్నారు.

 

Post Midle

Tags:Buggotsavam at Sri Govindarajaswamy temple

Post Midle