ఆర్టీసి బస్టాండులు నిర్మించండి

– ఎండి కృష్ణబాబును కోరిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి

Date:22/10/2019

బి.కొత్తకోట ముచ్చట్లు:

తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఏపిఎస్‌ ఆర్టీసి పరంగా అభివృద్ధి లేదు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆ సంస్థ కృష్ణబాబుకు విన్నవించారు. మంగళవారం విజయవాడలో ఎండి కృష్ణబాబును ఎమ్మెల్యే కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిస్థితులను వివరించారు. నియోజకవర్గంలో జనాభా పరంగా పెద్ద మండల కేంద్రమైన బి.కొత్తకోటలో ఆర్టీసి బస్టాండు లేదని ఎండి దృష్టికి తెచ్చారు. నియోజకవర్గంలో రవాణా పరంగా, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చోట్ల ఆర్టీసి బస్టాండుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, తద్వారా సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే విన్నవించారు. అలాగే బి.కొత్తకోట – బీరంగిరోడ్డులు డబుల్‌రోడ్డుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మార్గంలో రద్దీ అధికంగా ఉందని సరిహద్దులోని కర్నాటక ప్రాంతంలో డబుల్‌ రోడ్డు నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. ఈ మార్గంలో 9 కిలో మీటర్లు డబుల్‌ రోడ్డు నిర్మిస్తే బెంగళూరుకు రాకపోకలు పెరుగుతాయని తెలిపారు. కాగా ఆర్టీసి పరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధ్వాయనం చేయాలని ఆర్టీసి ఈడిఈకి ఎండి కృష్ణబాబు సూచించారు.

హార్సిహిల్స్ ఘాట్‌లో ప్రమాదం

Tags: Build RTC busts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *