పేదలకు పక్కాగృహాలు నిర్మించాలి

Build the poor for the poor

Build the poor for the poor

Date:08/12/2018

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని మేలుపట్ల ప్రాంతంలో పేద దళితులకు పక్కా గృహాలు నిర్మించాలని దళిత సంక్షేమసేవా సంఘ అధ్యక్షుడు శంకరప్ప కోరారు. శనివారం మేలుపట్లలో పర్యటించారు. ఈ సందర్భంగా 85 సంవత్సరంలో నిర్మించిన దళితుల గృహాలు శిధిలావస్థలో ఉండటాన్ని పరిశీలించారు. దీనిపై తహశీల్ధార్‌ మాదవరాజుకు వినతిపత్రం అందజేసి, శంకరప్ప మాట్లాడుతూ 20 కుటుంబాల వారికి ఇండ్లులేకపోవడం బాధకరమన్నారు. సుమారు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన గృహాలు శిధిలావస్థలో ఉండటం, అదే గృహాలలో దళితులు నివాసం ఉండటం బాధకరమన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే నష్టం ఊహించలేమని పేర్కొన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుని, పాత గృహాలు తొలగించి, పక్కా గృహాలు నిర్మించాలని కోరారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోనున్నట్లు తహశీల్ధార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్‌, గంగాధర్‌, గంగప్ప, లింగప్ప, జయరాం, చంద్రమోహన్‌, విశ్వనాథ్‌, నాగరాజు, సోమశేఖర్‌, ఆనంద, కిరణ్‌కుమార్‌, శీనప్ప పాల్గొన్నారు.

జనసేనతో చైతన్యం

 

Tags: Build the poor for the poor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *