రాజ్యాంగాన్ని నిర్మించడం ఈ దేశానికి ఎంతో గర్వకారణం
-దళిత మిత్ర వ్యవస్థాపక అధ్యక్షులు కైపు రామాంజనేయులు
కడప ముచ్చట్లు:
73వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగాఆంధ్రప్రదేశ్ దళిత మిత్ర సంఘ కడప జిల్లా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏసుపోగు రాజేష్ ఆధ్వర్యంలో కడప నగరం అంబేద్కర్ నగర్ దళిత మిత్ర సంఘం ఆఫీసులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యవస్థాపక అధ్యక్షులు కైపు రామాంజనేయులు హాజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగం నిర్మించి దాదాపు 73 ఏళ్లు కావస్తోంది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇంచుమించు మూడు సంవత్సరాలు నిద్ర ఆహారం లేకుండా ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్యాంగాన్ని నిర్మించడం ఈ దేశానికి ఎంతో గర్వకారమైనదని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత మిత్ర సంఘం యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఎం ప్రవీణ్ కుమార్, దళిత మిత్ర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటరమణ, కడప నగరం మూడో డివిజన్ దళిత మిత్ర సంఘం కమిటీ ఉపాధ్యక్షుడు చెప్పలే సుబ్బయ్య, గంగా ప్రసాద్, పకీరు పల్లె వంశి, కడప చిన్న తదితరులు పాల్గొన్నారు.

Tags: Building a constitution is a matter of great pride for this country
