Natyam ad

అమరావతిలో భవనాల లీజు..

విజయవాడ ముచ్చట్లు:


ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం రాజధాని అమరావతిలో సీఆర్‌డీఏ అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. కానీ అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధులు అవసరం. కానీ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రాజధాని అభివృద్ధికి నిధుల కోసం సీఆర్‌డీఏ మరింత కసరత్తు చేస్తోంది. రాజధాని పరిధిలో పూర్తయిన భవనాలను లీజుకివ్వాలని సీఆర్‌డీఏ ప్రతిపాదనలు చేసింది. రాజధానిలో గ్రూప్‌-డి ఉద్యోగులకు నిర్మించిన భవనాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్‌డీఏ ప్రతిపాదనలకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విట్‌ యూనివర్సిటీకి ఇందులో ఒక భవనాన్ని లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే విట్ యాజమాన్యంతో సీఆర్‌డీఏ సంప్రదింపులు కూడా జరిపింది.భవనాల లీజు ద్వారా ఏడాదికి రూ. 8-10 కోట్ల మేర లీజు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక టవర్‌లోని 120 ఫ్లాట్లను లీజుకు ఇచ్చి ఆదాయం ఆర్జించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన డీ-టైప్ భవనాల లీజుకు ఇచ్చేందుకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మొత్తం ఆరు టవర్లతో డీ-టైప్ బిల్డింగ్ నిర్మాణాలు జరగ్గా.. ముందుగా ఓ టవరును లీజుకివ్వాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. 2019 నాటికే 7.7 ఎకరాల విస్తీర్ణంలో 720 ఫ్లాట్లను సీఆర్డీఏ నిర్మించింది. 65శాతం మేర పనులు కూడా పూర్తయ్యాయి. 10,22,149 చదరపు అడుగుల సూపర్‌ బిల్టప్‌ ఏరియా కూడా అందుబాటులోకి వచ్చింది.

 

Tags: Building lease in Amravati ..

Post Midle
Post Midle