Natyam ad

భవన నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి చేయాలి

-ఆస్తి పన్నులను పకడ్బందీగా వసూలు చేయాలి
-జమ్మికుంట మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో
-జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
-బడ్జెట్ ను  ఏకగ్రీవంగా ఆమోదించిన పాలకవర్గం
కరీంనగర్ ముచ్చట్లు:
 
జమ్మికుంట పురపాలక సంఘం కు సంబంధించి ఆస్థి పన్నులను పకడ్బందీగా వసూలు చేయాలని, భవన నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.
సోమవారం కరీంనగర్ జిల్లా  జమ్మికుంట పురపాలక సంఘ కార్యాలయం సమావేశ మందిరం లో నిర్వహించిన 2022-2023 బడ్జెట్ సమావేశం లో ఆయన పాల్గొన్నారు. పురపాలక సంఘం చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో కలెక్టర్  మాట్లాడారు. ముందుగా పురపాలక సంఘం  అభివృద్ధి పనులకు సంబంధించి బడ్జెట్ ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవన  నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని, అనుమతులు లేకుండా నిర్మించే అక్రమ కట్టడాలను కూల్చివేయాలని సూచించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని అన్నారు. వ్యాపారాలు చేసుకునే వారికి తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్సులు ఉండేలా చూడాలని అన్నారు. రెసిడెన్షియల్ పేరిట కమర్షియల్ గా నిర్వహించే వాటిపై దృష్టి సారించి పన్నులు వేయాలని తెలిపారు. పన్నుల వసూళ్లు పకడ్బందీగా నిర్వహించి ఆదాయం పెంపొందించుకోవాలని కలెక్టర్ తెలిపారు.  పురపాలక సంఘం కు వచ్చే బడ్జెట్ లో 10 శాతం బడ్జెట్ ను హరితహారంకు కేటాయించాలని అన్నారు. జమ్మికుంట వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతుందని, పాలకవర్గం సమష్టి సహకారంతో ఆదాయం పెంచుకోవాలని కలెక్టర్ అన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు,  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, హుజురాబాద్ ఇంచార్జి ఆర్డిఓ-అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, మున్సిపల్ కమిషనర్ బి సుమన్ రావు,  వైస్ చైర్మన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Building permits must be made mandatory