నోయిడాలో కూలిన భవనాలు…

Buildings in Noida

Buildings in Noida

Date:18/07/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
నోయిడాలో కూలిన భవనాలు…ముగ్గురి మృతి ,50 మందికి  గాయాలు కొనసాగుతున్న సహాయక చర్యలు
ఢిల్లీ సమీపంలోని గ్రేటర్‌ నోయిడాలో మంగళవారం రాత్రి భవనాలు కూలిన ఘటనలో ముగ్గురి మృతి చెందగా 50 మందికి  గాయాలయినాయి.నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల భవనంపై పడింది. దాంతో ఈ రెండు భవనాలు కూలిపోయాయి. నాలుగు అంతస్తుల భవనంలో మొత్తం 18 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ సమాచారం అందిన వెంటనే స్థానిక యంత్రాంగం సహాయచర్యల్లో భాగంగా శిథిలాలను తొలగించే పనులను చేపట్టింది. భవన శిథిలాల్లో 30 మంది వరకూ చిక్కుకున్నారు. మరో 50 మందికి గాయాలవగా వారిని ఆసుపత్రికి తరలించారు. పొరుగున ఉన్న ఘజియాబాద్‌ నుంచి జాతీయ విపత్తు నివారణ బృందాన్ని రప్పించారు. వందలాది మంది పోలీసులు కూడా సహాయచర్యల్లో పాల్గొంటున్నారు. శిథిలాల నుంచి మూడు మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు. ప్రమాదం జరిగిన తర్వాత చాలాసేపటి వరకు అధికారులు ఎవరూ రాలేదని పేర్కొంటూ స్థానికులు భారీ సంఖ్యలో చేరుకుని నిరసనకు దిగారు. భ‌వ‌నాలు కూలిన ఘ‌ట‌న‌పై ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ జిల్లా క‌లెక్ట‌ర్‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. త‌క్ష‌ణ‌మే సహాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సీఎం ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నోయిడాలో కూలిన భవనాలు… https://www.telugumuchatlu.com/buildings-in-noida/
Tags:Buildings in Noida

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *