పుంగనూరులో నాడు-నేడు క్రింద రూ.43 లక్షలతో భవనాలు – ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు నాడు-నేడు పథకం క్రింద రూ.43 లక్షలతో హైస్కూల్‌ గదులు నిర్మిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పూజగానిపల్లె పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌తో కలసి హైస్కూల్‌లో రూ. 43 లక్షలతో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలో నాడు – నేడు పథకం క్రింద ఇప్పటి వరకు రెండు విడతలలో 80 భవనాలకు రూ.2.64 కోట్లరూపాయలతో భవనాలు నిర్మించడం జరిగిందన్నారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు అదనపు గదులు అవసరమైన అన్ని ప్రాంతాల్లోను పక్కా భవనాలు నిర్మించి, పాఠశాలలను అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతను పెంచి, మంచిపేరు తీసుకురావాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో కేశవరెడ్డి, సర్పంచ్‌ మోహన్‌ , ఎంపిటిసి సురేంద్ర, పార్టీ నాయకులు రామకృష్ణ, వెంకటరెడ్డి, రమణ, చంద్రారెడ్డి యదవ్‌, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags: Buildings in Punganur today and below with Rs. 43 lakhs – MP Akkisani Bhaskarreddy

Leave A Reply

Your email address will not be published.