34 నెలలవుతున్నాఅడుగు పడని నిర్మాణాలు

Buildings that are not below 34 months

Buildings that are not below 34 months

Date:09/10/2018
గుంటూరు  ముచ్చట్లు:
స్వయనా ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసిన భవనాల పనులు మూడేళ్లుగా ప్రారంభమే కాలేదు. ట్రిపుల్‌ఐటీలను స్థాపించి 10ఏళ్లు గడిచినా విద్యార్థులకు తరగతి గదులు, హాస్టల్, మెస్, గ్రంథాలయం తదితర వసతులు మాత్రమే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగా, సబ్జెక్టుల వారీగా అవసరమైన వసతులు బోధనా సిబ్బందికి మాత్రం అందుబాటులోకి రాలేదు. పీయూసీకి సంబంధించి గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, ఇంగ్లిషుతో పాటు ఇంజినీరింగ్‌కు సంబంధించి మెకానికల్, సివిల్, సీఎస్‌ఈ, ఈసీఈ, కెమికల్, మెటలర్జీ బ్రాంచిలకు సంబంధించి డిపార్ట్‌మెంటుల వారీగా వసతులు లేవు. దీంతో హెచ్‌ఓడీలు అకడమిక్‌ భవనాలలో, పరిపాలన భవనంలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతులతో సర్దుకుంటున్నారు.
పదిశాఖలకు సంబంధించి వసతులతో పాటు హెచ్‌ఓడీలు, స్టాఫ్, విద్యార్థులతో సమావేశాలు నిర్వహిం చుకోవడానికి అవసరమైన అన్ని రకాల వసతులు ఉండేలా నిర్మించాల్సి ఉంది. ఈ నేపధ్యం లోనే అప్పట్లో ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించారు. ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంతో శిలాఫలకాలపై పేర్లు వేసుకోవడానికి శంకుస్థాపన చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఈ భవనం నిర్మాణ పనులు ప్రారంభించాలని ట్రిపుల్‌ఐటీ హెచ్‌ఓడీలు, అధ్యాపకులు కోరుతున్నారు.రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు ట్రిపుల్‌ఐటీలో శాఖా భవనాలకు 2015, డిసెంబరు 23న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
ఆర్జీయూకేటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  అయితే ఇది జరిగి 34 నెలలవుతున్నా దీని గురించి పట్టించుకున్న వారే లేరు. వచ్చేపోయే వారికి స్వాగతం పలుకుతున్నట్లుగా శిలాఫలకాలు ప్రధాన గేటు పక్కనే ఉండి దర్శనమిస్తున్నాయి. శాఖల వారీగా వసతులు కల్పించాల్సిన డిపార్ట్‌మెంట్‌ భవనాల జాప్యంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రూ.60కోట్ల అంచనాలతో నిర్మించాల్సి ఉన్న ఈ భవనం మొత్తం 3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ప్రస్తుతం ట్రిపుల్‌ఐటీలో ఒక్క మెకానికల్‌ బ్రాంచికి మాత్రమే పూర్తిస్థాయిలో ల్యాబ్‌ సదుపాయం ఉంది. మిగిలిన ఐదు బ్రాంచీలకు పూర్తిస్థాయిలో ల్యాబ్‌  సదుపాయం లేదు. అలాగే హెచ్‌వోడీలకు సరైన సదుపాయాలు, సౌకర్యాలు లేవు. ఉన్న వాటిల్లోనే ప్రస్తుతం సర్దుకుంటున్నారు. ఎంతో ముఖ్యమైన ఇలాంటి భవన నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి.
Tags:Buildings that are not below 34 months

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *