100కు చేరిన బంతిపూలు

Bunch of flowers reached by 100
Date:15/04/2019
తిరుపతి ముచ్చట్లు:
 బంతి పూలధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. మండల పరిధిలో ఎక్కువగా బంతిపూలు సాగు చేస్తున్నారు. వీటిని ఇక్కడి నుంచి తిరుపతి, విజయవాడ, హైదరాబాద్‌, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. కొద్దిరోజులుగా కిలో పూలు రూ.20-30 పలికేవి. వారం రోజులుగా ఒక్కసారిగా పూల ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణంగా వివిధ ప్రాంతాల్లో పూల సాగు జనవరిలో ముగిసిపోతుంది. వేసవిలో అక్కడ పూలసాగుకు అనుకూలంగా ఉండకపోవడంతో ఈ ప్రాంతంలో సాగైన పూలపై ఇతర ప్రాంతీయులు ఆధారపడాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడ పూలను కొనుగోలు చేయడానికి ఇతర ప్రాంతాల వ్యాపారులు పెద్దఎత్తున వస్తున్నారు. ప్రస్తుతం మండలంలో సైతం వేసవి, నీటిఎద్దడి కారణంగా పూలసాగు కొంతమేర తగ్గినా, ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులకు లాభదాయకంగా ఉందని పేర్కొంటున్నారు. ఇక్కడి మార్కెట్‌లో  బంతిపూలు కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలికాయి.
Tags: Bunch of flowers reached by 100

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *