కర్నూలులో ప్లాస్మాధెరపితో కట్టడి

Date:09/05/2020

కర్నూలే ముచ్చట్లు:

కర్నూలు జిల్లాలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలులో ప్లాస్మా థెరపీ చికిత్సకు వైద్య ఆరోగ్యశాఖ అనుమతి ఇచ్చింది. కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్ లో రక్త సేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి వైద్యులు ప్లాస్మా సేకరించనున్నారు. కర్నూలు జిల్లాలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు 17 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం 533 కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 30 శాతం పైనే కేసులు నమోదు అవుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేశారు. కర్నూలులో ప్లాస్మా థెరపీ చికిత్సకు సంబంధించిన సమాచారం అందుతోంది.

 

 

 

రికవరి అయిపోయి ఇంటికెళ్తున్న కరోనా పేషెంట్ల నుంచి ప్లాస్మా తీసుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ప్లాస్మా అంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలను సపరేట్ చేసి, మళ్లీ పేషెంట్ ఎక్కిస్తామని చెప్పారు. కేవలం వారిలో ఉన్న ప్రోటీన్స్ లిక్విడ్ తీసుకొని ప్రిజర్వ్ చేస్తామని చెప్పారు. ఒక సంవత్సరం వరకు దాన్ని దాచి పెట్టవచ్చన్నారు. చాలా తీవ్రమైన, ఐసీయూలో ఉండి క్రిటికల్ కండీషన్ లో ఉన్న పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటివరకు అయితే అలాంటి కేసులు ఎక్కువగా లేవు. కానీ ముందుస్తు జాగ్రత చర్యగా ప్రభుత్వం ఈ దిశగా నడుస్తోంది. కోలుకున్న వారు ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

 

 

 

ప్రస్తుతం ఎనిమిది మంది ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నయం అయిపోయి ఇంట్లో ఉన్న వారు ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. సాధారణంగా వ్యక్తి నుంచి 250 మి.లీ ప్లాస్మా తీసుకుంటామని..అది ఒక వ్యక్తికి మాత్రమే ఉపయోగపడుతుందన్నారు.క్రిటికల్ కండీషన్ లో ఉన్న వ్యక్తికి ఒకసారి ప్లాస్మా ఎక్కిస్తే చాలు 10 నుంచి 15 రోజుల వరకు శరీరంలో ఉంటుంది. వేరే డోనర్ నుంచి తీసుకున్నది రోగికి ఇచ్చామంటే 10 నుంచి 15 రోజులు వరకు పని చేస్తుందని చెప్పారు. అంతలోపు పేషెంగ్ స్వతాగా యాంటి బయోటిక్ తయారు చేసుకుంటాడని చెప్పారు. అంతవరకు మనం ప్రొటెక్షన్ ఇస్తామని వెల్లడించారు.

గౌతంరెడ్డికి తిరుగు లేదంట

Tags: Bundle with plasma therapy in Kurnool

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *