పుంగనూరు అభివృద్ధి బేష్ ….

Bungano development bash ....
– రాష్ట్ర కార్యదర్శి కన్నబాబు , ఇఎన్సి చంద్రయ్య ప్రశంసలు
Date:22/11/2018
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మున్సిపాలిటి అభివృద్ధి బేష్ అంటు రాష్ట్ర మున్సిపల్ కార్యదర్శి కన్నబాబు , రాష్ట్ర ఇంజనీరింగ్ చీఫ్ చంద్రయ్యలు ప్రశంసించారు. గురువారం తిరుపతిలో పుంగనూరు కమిషనర్ కెఎల్.వర్మతో కలసి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఎస్సీసాబ్ప్లాన్ క్రింద మంజూరైన రూ.6 కోట్ల పనులను డిసెంబర్ 30 లోపు పూర్తి చేయించాలని ఆదేశించారు. అలాగే నీటి సమస్య, విద్యుత్ సమస్య లేకుండ పారిశుద్ధ్య కార్యక్రమాలలో అగ్రస్థానంలో ఉండటంపై ప్రశంసించారు. అలాగే 12 మంది కార్మికులు మరణించారని, వారి స్థానంలో కొత్తవారిని నియమించుకునేందుకు కమిషనర్ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. పుంగనూరు మున్సిపాలిటి ఇదే తరహాలో ముందుకు నిలవాలని కమిషనర్‌కు సూచించారు. కమిషనర్ కెఎల్.వర్మ కన్నబాబుకు శ్యాలువకప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈఈ ప్రసాద్, పబ్లిక్‌హెల్త్ ఇంజనీర్ సంజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags; Bungano development bash ….