కేసీఆర్ పై బంగి ఆగ్రహం

Date:06/10/2018
కర్నూలు ముచ్చట్లు:
కర్నూలు మాజీ మేయర్ బంగి ఆనంతయ్య వినూత్న మైన  నిరసనలు తెలపడంలో దిట్ట. గుండు కొట్టించుకోవడం,  గాడిదలపై ఊరేగాడం లాంటి చేసి తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేస్తుంటారు.  మొన్నటికి మొన్న డీజిల్, పెట్రోల్ ధరల పెరగడం పై ఎద్దుల బండి పై ఊరేగుతూ నిరసన  తెలిపారు.  ఇక శనివారం మరో  రూపంలో తన కోపాన్ని ప్రదర్శించారు.
టిఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏసీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు పై చేసిన భాష జాలం పై బంగి తన ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ బొమ్మ ఉన్న ఫ్లెక్సీ పై చెప్పులు, చీపుర్లలతో కొట్టి నిరసన తెలిపారు. ఉన్నతమైన హోదా లో ఉండి ఇలాంటి భాష వాడటం సరైంది కాదన్నారు. ఇలాగే మాట్లాడితే,  రానున్న రోజుల్లో మరో విధంగా  నిరసన చేపట్టాల్సి వస్తుందని బంగి హెచ్చరించారు.
Tags:Bungee angry on KCR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *