వంట గ్యాస్ ధరతో సామ్యనిడిపై భారం

-మాజీ ఎమ్మెల్యే విజయరమణా రావు

పెద్దపల్లి ముచ్చట్లు:

 

వంట గ్యాస్ ధర  పెంచడంతో సామాన్యుడు నెత్తిన గుదిబండ పడినట్లైందని, మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు కొనసాగుతోందని  మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలకు నిరసనగా పెద్డపల్లి పట్టణంలోని  జండా కూడలి వద్ద  కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో  కాంగ్రెస్‌ శ్రేణులు మహిళలు రోడ్డుపై కట్టెల పొయ్యితో వంట చేస్తూ,ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు.  కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా  ఎమ్మెల్యే విజయరమణా రావు గారు మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లలో వంట గ్యాస్, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం ద్వారా మోదీ సర్కార్‌ ప్రజల జేబుల్లోంచి లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎలాంటి  సంక్షేమ పథకాలు చేపట్టకుండా మత రాజకీయాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగినా తమ ప్రభుత్వం  ప్రజలను దృష్టి లో ఉంచుకొని  ధరలు పెంచలేదన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటూ విపరీతంగా విద్యుత్ బిల్లులు పెంచి వినియోగ దారులపై భారం మోపుతున్నారని ఆగ్రహించారు. సంక్షేమం, అభిృద్ది పేరిట మద్యం ధరలను విపరీతంగా పెంచి నేడు నిరుపేద కుటుంబాలను రోడ్డు పాలుచేస్తున్నారని మండిపడ్డారు.  గ్యాస్ ధరలతో మళ్లీ కట్టేల పోయ్యి పైన వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వరంగల్ సభలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వెల్లడించిన డిక్లరేషన్ ను నియోజక వర్గంలోని ప్రతి గ్రామ గ్రామాన ప్రజలకు వివరిస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మోసాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి  కృషి చేస్తామన్నారు.పెంచిన వంట గ్యాస్ తోపాటు పెట్రోల్, డీజిల్,విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

 

Post Midle

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, జడ్పీటీసీ, మినుపాల స్వరూప రాణి – ప్రకాష్ రావు,మాజీ సర్పంచ్,అంతటి పుష్పలత- అన్నయ్య గౌడ్,’మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మాజీ వైస్ చైర్మన్  నూగిల్ల మల్లయ్య, కౌన్సలర్ నేతట్ల స్వరూప -కుమార్, భూతగడ్డ స్వప్న-సంపత్,తాడూరి పుష్పకల-శ్రీమాన్, తూముల సుభాష్,ఎండీ నిషన్,బొడ్డుపల్లి శ్రీనివాస్,గంగుల భారతి- వెంకటేష్, ఈర్ల స్వరూప, వేముల రాజు, కొలిపాక శోభ, తమ్మడవేన స్వప్న-శ్రీనివాస్, దేవరకొండ రాజు, బొడ్డుపల్లి తిరుపతి, పేరుక సంతోష్, ఎంచర్ల తిరుమలేష్,కొలిపాక రాయమల్లు,అరే సంతోష్, నాంసాని శ్రీనివాస్, చెవుల తిరుపతి, తూముల మహేష్, వేముల వీరశం, కొలిపాక శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Burden on Samyanidi with cooking gas price

Post Midle
Natyam ad