పెరిగిన గ్యాస్ ధరలతో ప్రజలపై భారం

Burdened people with increased gas prices

Burdened people with increased gas prices

Date:31/12/2018
నల్లగొండ ముచ్చట్లు:
కేంద్రం నెలనెల వంట గ్యాస్ ధర పెంచుతూ పేదల జీవితాలతో చెలగాటం అడుతున్నది. 16 నెలల్లో, 19 సార్లు సవరించి ఇప్పటికే కోట్లాది రూపాయాల భారంవేసింది. నిత్యాసర వస్తువుల ధరలు నింగినంటి సామాన్యుడిపై భారం వేసి ఆగమాగం చేస్తున్నాయి. తామేమి తక్కువకాదని ఉమ్మడి జిల్లాల్లోని గ్యాస్ ఏజెన్సీలు కూడా నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి.రవాణా పేరుతో సరఫరా దారుల నుంచి ఒక్కో సిలిండర్‌కు రూ. 20 నుంచి రూ. 40 వరకు వసూలు చేయిస్తూ ఘరణా దోపిడీకి ఏజెన్సీలు పాల్పడుతున్నాయి. నిబంధనల ప్రకారం సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా తతంగం జరుగుతున్నది. ఈ దోపిడీ బహిరంగ రహస్యమే అయినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. తనిఖీల కోసం ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం కేవలం ప్రకటనలకే పరిమితమౌతున్నాయి.వినియోగదారులు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
నెలనెల మామూళ్లతో సరిపెట్టుకున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక సిలిండర్‌ను సరఫరా చేస్తే అయిల్ కంపెనీలు ఏజెన్సీలకు రూ. 50వరకు కమీషన్ ఇస్తాయి. సరఫరాదారులకు వేతనాలు చెల్లించాలి. అయితే సరఫరాదాలకు ఏజెన్సీలు చాలా తక్కువ వేతనం చెల్లిస్తున్నాయి. అన్ని జిల్లాల్లో నెలకు రూ. 5 వేల నుంచి 6 వేల వరకు చెల్లిస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో రూ. 3 నుండి  రూ. 4 వరకు ఇస్తుండడం గమనార్హం. ఇతర అలవెలన్సులు కూడా చెల్లించకుంగా అరకొర వేతనమే ఇస్తూ మిగతా మొత్తాన్ని వినియోగదారుల నుంచి తీసుకోవాలని ఒత్తిడి తెలుస్తున్నట్లు సమాచారం.పట్టణాల్లో 5 కిలోమీటర్ల వరకు నగర ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల వరకు ఉచితంగా సిలిండర్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. గ్యాస్‌తో పాటు తెచ్చే బిల్లుపై ఉండే ధరను మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకోవాలి. అదనంగా ఎలాంటి రవాణా చార్జీలు వసూ లు చేయరాదు.
అయితే నిర్ధేశించిన దూరం కంటే 10 కి.మి ఎక్కువతే రూ. 15, మరో 10 కి.మి దాటితే రూ. 34 అదనంగా తీసుకోవచ్చు. వినయోగదారుడు స్వయంగా ఏజెన్సీకి వెళ్లి తీసుకుంటే క్యాష్ అండ్ క్యారీ కింద ధరలో రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది.సిలిండర్ ధరలో రూ. 18 తగ్గించాలి. కానీ అలాంటి నిబంధనలేవి పాటించకుండా ఏజెన్సీలు ఘరణా మోసానికి పాల్పడుతున్నారు. నేరుగా తీసుకుంటే ఇంత ధర, ఇంటికి చేరిస్తే ఇంత ధర అనే బోర్డులు కూడా ఏజెన్సీలు ఏర్పాటు చేయాలి. కానీ అలాంటివి ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. సిలిండర్ సరఫరాచేసిన తరువాత దానికి సంబంధించిన రసీదును వినియోగ దారులకు ఇవ్వాలి.రసీదుపై ఎంత ధర ఉంటే అంతే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ నిబంధన అలా జరగడం లేదు. సిలిండర్ సరఫరా చేసే ముందు బరువును లెక్కించాలి. బరువు తూగే యంత్రాన్ని సరఫరా దారులు నిరంతరం వెంటనే ఉంచుకోవాలి.
వినయోగదారుడు తీసుకోవడానికి అంగీకరించిన తరువాతే సిలిండర్ పంపిణీ చేయాలి. సిలిండర్ పంపిణీ తరువాత దానిని రేగ్యులేటర్‌కు బిగించి డెలివరి బాయ్ పరీక్షించాలి ఈ విధంగా చేస్తున్న గ్యాస్ ఏజెన్సీలు జిల్లాల్లో కనిపించిన దాఖలాలు లేవు.గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వినయోగదారుడికి తెలియకుండానే సిలిండర్లను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారనే విమర్వలు వినిపిస్తున్నాయి. ఫోన్ నెంబర్ ఆధారంగా ఆన్‌లైన్ ప్రక్రియ జరుగుతుంది. ప్రతి వినియోగదారుడు సంవత్సరానికి 12 సిలిండర్లు తీసుకోవాలి. ఏవరైతే ఈ సదుపాయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించకుండా ఉంటారో అలాంటి వారి పేరుపై ఆన్‌లైన్‌లో బుక్ చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు.సిలిండర్ అయిపోయినప్పుడు ఏజెన్సీకి వెలితే కోట పూర్తయిందంటూ నిర్వాహకులు సమాధానం ఇస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. ఇంతా జరుగుతున్న అధికారులు పట్టించు కోవడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి గ్యాస్ ఏజెన్సీలపై నిఘా ఏర్పాటు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.
Tags:Burdened people with increased gas prices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed