పుంగనూరులో ఇంటితాళాలు పగులగొట్టి దొంగతనం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని సుల్తాన్‌సాహెబ్‌వీధిలో నివాసం ఉన్న ఫ్యారిజాన్ ఇంటి తాళాలు పగులగొట్టి శుక్రవారం రాత్రి ఇంటిలో ఉన్న ఐదు ఉంగరాలు, ఒక బ్రేస్‌లెట్, ఒక చెను దొంగలించుకెళ్లినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు 45 గ్రాముల బరువు గల నగలు చోరీ అయిందని పేర్కొంది. ఇల్లు తాళాలు వేసి ఊరికి వెళ్లి తిరిగి రావడంతో తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఎస్‌ఐ మోహన్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags; Burglary by breaking house locks in Punganur

