బురిడీ బాబా అరెస్ట్

Date:22/05/2019

 

కడప  ముచ్చట్లు:

తాంత్రిక విద్యల తో దెయ్యాల్ని వదిలిస్తానని అనారోగ్యం పాలైన వారిని పూజల ద్వారా ఆరోగ్యవంతులను చేస్తానని మాయమాటలు చెప్పి డబ్బులు గుంజు తున్న పెంచల్ రెడ్డి అనే మంత్రగాడిని పోలీసులు  అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు అర్బన్ సిఐ రమేష్ బాబు తెలిపారు.  స్థానిక అర్బన్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో నివాసముంటున్న రంగ లక్ష్మమ్మ తన భర్త రామ్మోహన్ అనారోగ్యం పాలు కావడంతో ఆసుపత్రుల లో చూపించినా బాగు కాకపోవడంతో ఎవరో చెప్పిన మాటలు విని ఈ నెల 17న శివ నగర్ కు చెందిన తాంత్రిక వైద్యుడు వద్దకు తీసుకు వెళ్ళిందినీ  భర్తకు బాగు చేస్తానని చెప్పి 25 వేల రూపాయల వరకు డబ్బులు తీసుకున్నాడు అని పూజలు పెట్టి ఆరోగ్యం బాగు చేయకపోగా తన భర్తను శారీరకంగా హింసించాడని  ఫిర్యాదు చేసిందని తెలిపారు ఈ మేరకు మంగళవారం పెంచల్ రెడ్డి ని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు ప్రజలు మూఢాచారాలను నమ్మవద్దని  తాంత్రిక విద్యల పట్ల ఆకర్షితులు కావద్దని తద్వారా ఆరోగ్యం బాగు  కాకపోగా డబ్బులను సైతం పోగొట్టుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్సై హేమాద్రి. ఏ ఎస్ ఐ దాదావలి తదితరులు పాల్గొన్నారు.

 

సిటీ ఉద్యోగులకు భద్రత కరువు

 

Tags: Buridi Baba’s arrest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *