బుర్ఖా వేసుకుని బాలికల హస్టల్ లోకి విద్యార్ది

Date:19/05/2018
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
అమ్మాయిలా బుర్ఖా వేసుకొన్న ఓ పీజీ విద్యార్థి తన సహ విద్యార్థిని ఉండే బాలికల వసతిగృహంలోకి వెళ్లి.. అధికారులకు పట్టుబడటంతో భయంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పాలమూరు విశ్వవిద్యాలయ (పీయూ) అధికారుల సమాచారం ప్రకారం…మహబూబ్నగర్ జిల్లాలోని మద్దూరు మండలం బూనీడు గ్రామానికి చెందిన సద్దాం హుసేన్ (21) పీయూలో ఇంటిగ్రేటేడ్ కెమిస్ట్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 16న తన సహచార విద్యార్థినితో కలిసి బుర్ఖా వేసుకొని విద్యార్థినుల వసతిగృహంలోకి వెళ్లాడు. ఇరుగు పొరుగు గదుల విద్యార్థినుల సమాచారంతో యువకుణ్ని, అతణ్ని లోనికి తీసుకువచ్చిన విద్యార్థినిని మేట్రన్ మందలించి పంపించారు.  సద్దాం సెల్ఫోను తమ దగ్గరే పెట్టుకొని మరుసటిరోజు ఉదయం వచ్చి తీసుకువెళ్లాలని సూచించారు. మరోమారు వసతి గృహంలోకి రానని లేఖ రాయించుకున్నారు. తన చెల్లితో కలిసి వసతిగృహం చూడటానికి వచ్చినట్లు అతను లేఖలో రాశాడు. తెల్లారితే మళ్లీ ఏమవుతుందో అనే భయంతో సద్దాం అదే రోజు (బుధవారం) రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం మహబూబ్నగర్ శివారు మన్యంకొండ వద్ద మృతదేహాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు గుర్తుతెలియని శవంగా పత్రికలకు సమాచారం ఇచ్చారు.  విషయం తెలుసుకున్న సద్దాం తల్లిదండ్రులు మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్.ఐ. రాఘవేందర్ తెలిపారు. ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, పీయూ ఉప కులపతి ఆచార్య రాజారత్నం, రిజిస్ట్రార్ తదితరులు ఆరా తీశారు.  ఈ సంఘటనపై విచారణకు ఓ కమిటీ వేస్తామని పీయూ వీసీ రాజారత్నం తెలిపారు.
Tags: Burkha walked into the girls’ hostel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *