Natyam ad

మండే సూరీడు….రెండు రోజులు ఆరెంజ్ అలెర్ట్

విజయవాడ ముచ్చట్లు:


ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం వేశలో ఇంట్లో నుండి బయట కాలు పెట్టాలంటే జనం జంకుతున్నారు. భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో గురు, శుక్ర వారాల్లో వడగాల్పులు తీవ్రంగా ఇబ్బంది పెడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏపీలో ఎండలు విపరీతం అయ్యాయి. నేడు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వడగాలులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వెదర్ బులెటిన్ లో తెలిపారు.‘‘ఏపీలో 21, 22 తేదీల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు కొన్ని చోట్ల వర్షాలు, గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాడగాడ్పులు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీ అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, క్రిష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కాస్త ఎక్కువగా వడగాడ్పులు ఉంటాయని అంచనా వేశారు.‘‘కర్నూలు నగరం పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది.

 

 

 

 

ఇది ఇలా ఉండగా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో వేడి అనేది 40 డిగ్రీలను దాటుతోంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, ఎన్.టీ.ఆర్., ఏలూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, నంధ్యాల, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు 42-44 డిగ్రీలను తాకుతోంది. ఏప్రిల్ నెలలో ఇలా ఉండగా మే నెలలో మాత్రం వేడి ఇకా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్.నినో పసిఫిక్ లో ఏర్పడుతోంది కాబట్టి భారత భూభాగంలో ఉన్న తేమను లాగుతోంది. దీని వలన ఎండలు తీవ్రంగా మారుతున్నాయి. విశాఖ నగరంలో 40.7 డిగ్రీలు నమోదవుతోంది. అలాగే విజయవాడలో 43 డిగ్రీలు నమోదవుతోందిరాష్ట్రంలో 125 మండలాల్లో వడగాల్పులు తీవ్రంగా ఇబ్బంది పెడతాయని హెచ్చరించింది. శుక్రవారం 40 మండలాల్లో వడగాల్పులకు ప్రజలు ఠారెత్తిపోతారని హెచ్చరికలు జారీ చేసింది. ఒకవైపు తీవ్ర ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాల్పుల కారణంగా ఇంటి నుండి బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరం అయితే తప్పా పగటి పూట బయటకు రావొద్దని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక మెసేజీలు పంపిస్తున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది. మన్యం జిల్లా కొమరాడ, పార్వతీపురం కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

 

 

 

 

Post Midle

అల్లూరి జిల్లాలోని 7 మండలాల్లో గురువారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అనకాపల్లిలో 15, తూర్పుగోదావరిలో 4, ఏలూరులో 2, గుంటూరులోని 11 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అధికారులు తెలిపారు. కాకినాడలోని 10 మండలాల్లో, కృష్ణాలో 4, ఎన్టీఆర్‌ జిల్లాలో 12, పల్నాడులో 5 మండలంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. పార్వతీపురంమన్యంలో 11, శ్రీకాకుళంలో 13, విశాఖపట్నంలో 2, విజయనగరంలో 23, వైఎస్ఆర్ జిల్లాలో 6 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు.

 

 

 

బుధవారం అనకాపల్లి 8, విజయనగరంలో ఒక మండలంలో తీవ్ర వడగాల్పులు ఇబ్బంది పెట్టాయి. మరో 93 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు.నిర్మల్‌, జగిత్యాల జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 11 జిల్లాల్లో 44 డిగ్రీలపైన నమోదయ్యాయి. గ్రామాల్లో ప్రజలు బయటికి రావాలంటే భయపడ్డారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు కొంత ఉపశమనం లభించవచ్చని, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపే నమోదుకు అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భుపాలపల్లి,  ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు (30 నుంచి 40 కిలో మీటర్ల వేగం) కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

 

Tags; Burning sun….orange alert for two days

Post Midle