బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు, ఆర్కే మలినేనిల‌ ‘క్యాలీఫ్లవర్‌’ షూటింగ్‌ పూర్తి

 

సినిమాముచ్చట్లు:

‘కొబ్బరిమట్ట’ సినిమాతో మంచి విజయం సాధించిన తర్వాత బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు నటిస్తున్న తాజా అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ ‘క్యాలీఫ్లవర్‌’. ‘‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ట్యాగ్‌లైన్‌. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంపూర్ణేష్‌బాబు బర్త్‌ డే సందర్భంగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, బ్యాంగ్‌ వీడియోకు మంచి స్పందన‌ లభించింది. ఇంగ్లాండ్‌ నుంచి ఇండియా వచ్చిన ఓ ఇంగ్లీష్‌మ్యాన్‌గా సంపూ ఈ చిత్రంలో కనిపిస్తారు. ఈ క్యాలీఫ్లవర్‌ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతుంది. షూటింగ్‌ పూర్తయిన విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమాలోని సంపూర్ణేష్‌బాబు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్‌. లార్డ్‌ కృష్ణ అవతారంలో సంపూ లుక్‌ ఆకట్టుకునేలా ఉంది. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్‌ పతాకాలపై ఆశ జ్యోతి గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీకిరణ్‌ ఈ సినిమాకు కథ అందించారు.  సంపూర్ణేష్‌బాబు సరసన ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్‌గా నటిస్తున్నారు.ముజీర్‌ మాలిక్‌ ఛాయా గ్రాహ‌కునిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ప్రజ్వల్‌ క్రిష్‌ సంగీతం అందిస్తున్నారు. బాబు ఈ సినిమాకు ఎడిటర్‌.
నటీనటులు: సంపూర్ణేష్‌బాబు, వాసంతి, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, నాగ మహేశ్, గెటప్‌ శీను, రోహిని, కాదంబరి కిరణ్, కల్లు కృష్ణారావు, విజయ్, కల్యాణీ, సుమన్‌ మనవ్వాద్, ముస్కాన్, బేబీ సహృద, రమణ్‌దీప్‌,,

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Burningstar Sampoornesh Babu, RK Malineni complete ‘Cauliflower’ shooting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *