Natyam ad

బస్సు చార్జీలు తగ్గించాలి

అమరావతి ముచ్చట్లు:
 
తెలంగాణలో లేని బస్సు ఛార్జీల పెంపు, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఎందుకు ముఖ్యమంత్రి జగన్  ? వారివి మాత్రం బస్సులు కావా? వారు వాడేది డీజిల్ కాదా అని బీజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. మీ ప్రభుత్వం మద్యం ధరలు ,సినిమా టికెట్ల రేట్లలో చూపించిన శ్రద్ధ, పేద ప్రయాణికుల బస్సు ఛార్జీల విషయంలో ఎందుకు చూపించడం లేదు? చిన్న సినిమాను,పెద్ద
సినిమాను ఒకేలా చూసిన వారు,సాధారణ బస్సులను, ప్రత్యేక బస్సులను ఒకేలా ఎందుకు చూడలేకపోతున్నారు? పండుగ బస్సుల్లో 50 శాతం రేట్ ఎందుకు ఎక్కువ? రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమాధానంచెప్పాలి,ప్రత్యేక ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని బిజెపి రాష్ట్ర పార్టీ డిమాండ్ డిమాండ్ చేస్తుంని అన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Bus fares should be reduced